అదనపు కట్నం కోసం హత్య?
కడపజిల్లా ఖాజీపేట మండల పరిధిలోని కె.సుంకేశుల గ్రామంలో వివాహిత పి.రాజేశ్వరి (20) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. దువ్వూరు మండలం నారాయణపల్లె గ్రామానికి చెందిన రాజేశ్వరికి సుంకేశుల గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డి తో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. అప్పట్లో 6 తులాల బంగారం, లక్ష రూపాయలు కట్న కానుకల కింద ఇచ్చారు. మృతురాలి భర్త రామకృష్ణారెడ్డి బేల్దారి పని చేస్తుండేవాడు. తరచూ మద్యం తాగి అదనపు కట్నం కోసం […]
Advertisement
కడపజిల్లా ఖాజీపేట మండల పరిధిలోని కె.సుంకేశుల గ్రామంలో వివాహిత పి.రాజేశ్వరి (20) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. దువ్వూరు మండలం నారాయణపల్లె గ్రామానికి చెందిన రాజేశ్వరికి సుంకేశుల గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డి తో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. అప్పట్లో 6 తులాల బంగారం, లక్ష రూపాయలు కట్న కానుకల కింద ఇచ్చారు. మృతురాలి భర్త రామకృష్ణారెడ్డి బేల్దారి పని చేస్తుండేవాడు. తరచూ మద్యం తాగి అదనపు కట్నం కోసం రాజేశ్వరిని వేధిస్తుండేవాడని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త రామకృష్ణా రెడ్డి, మామ చండ్రఓబుల రెడ్డి, అత్త జయమ్మ, ఆడపడుచు ఓబులమ్మ, ఆమె భర్త ప్రసాదరెడ్డి తమ కుమార్తెను అదనపు కట్నం కోసం హత్య చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారని పోలీసులు తెలిపారు. వారందరిపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
Advertisement