ఏపీలో రెండు ప్రభుత్వశాఖల మధ్య నిప్పు!
ఆంధ్రప్రదేశ్‌లో రెండు ప్రభుత్వ విభాగాల మధ్య నిప్పు రాజుకుంది. ఒకటి ప్రజా క్షేమం కోసం ప్రయత్నిస్తుండగా మరొకటి సంక్షేమం సంగతి తమకెందుకు… సంపద వస్తే సరిపోతుందనుకుంటోంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే జాతీయ రహదారిలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని రవాణా శాఖ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా రవాణా, జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్ఏ), పోలీసు, ఆరోగ్యశాఖల అధికారులతో కలిసి ఆరు బృందాలుగా ఈ రహదారిపై సర్వే జరిపారు. ప్రమాదాలు జరగడానికి ఎక్కువగా వాహన చోదకులు మద్యం […]
Advertisement
ఆంధ్రప్రదేశ్‌లో రెండు ప్రభుత్వ విభాగాల మధ్య నిప్పు రాజుకుంది. ఒకటి ప్రజా క్షేమం కోసం ప్రయత్నిస్తుండగా మరొకటి సంక్షేమం సంగతి తమకెందుకు… సంపద వస్తే సరిపోతుందనుకుంటోంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే జాతీయ రహదారిలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని రవాణా శాఖ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా రవాణా, జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్ఏ), పోలీసు, ఆరోగ్యశాఖల అధికారులతో కలిసి ఆరు బృందాలుగా ఈ రహదారిపై సర్వే జరిపారు. ప్రమాదాలు జరగడానికి ఎక్కువగా వాహన చోదకులు మద్యం సేవించి డ్రైవింగ్ చేయడంగా భావించారు. దీంతో జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న మద్యం షాపులను తొలగించాలని రవాణా శాఖ అధికారులు ఎక్సైజ్ శాఖకు ప్రతిపాదించారు. అధిక ఆదాయం సమకూర్చే ప్రాంతంలో మద్యం షాపులను తొలగించడానికి ఎక్సైజ్ శాఖ ససేమిరా అంటోంది. అవసరమైతే నిబంధనలు కఠినతరం చేయాలని, తమ సిబ్బంది కూడా సహకరిస్తారని… అంతేకాని మొత్తం జాతీయ రహదారి అంతటా షాపులను తొలగించడం అంటే ఆదాయానికి గండి కొట్టుకోవడమేనని, ఇదసలు కుదిరే పని కాదని ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుందోనని ఇరు శాఖలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.-పీఆర్
Advertisement