దొంగలుగా మార్చిన వ్యసనాలు

చెడు వ్యసనాలకు బానిసలైన ఓ నలుగురు యువకులు చివరకు దొంగలుగా మారారు. తేలికగా డబ్బు సంపాదించడానికి దోపిడీలను మార్గంగా చేసుకున్నారు. దారి దోపిడీలకు పాల్పడుతూ పోలీసుల చేతికి చిక్కారు. భవిష్యత్ ను చేజేతులా నాశనం చేసుకున్నారు. విజయవాడ సమీపంలోని పాయకాపురానికి చెందిన నలుగురు యువకులు బండి హేమంత్ కుమార్, ఇనుపకుర్తి రాంకీ, కొణతం రవి కుమార్, గంగిరెద్ది కృష్ణారెడ్డి వరుసగా దారి దోపిడీలకు పాల్పడుతున్నారు. కారు డ్రైవర్లుగా నటిస్తూ ప్రయాణీకులను మారు మూల ప్రాంతాలకు తీసుకెళ్ళి కత్తులతో […]

Advertisement
Update:2015-04-16 04:50 IST

చెడు వ్యసనాలకు బానిసలైన ఓ నలుగురు యువకులు చివరకు దొంగలుగా మారారు. తేలికగా డబ్బు సంపాదించడానికి దోపిడీలను మార్గంగా చేసుకున్నారు. దారి దోపిడీలకు పాల్పడుతూ పోలీసుల చేతికి చిక్కారు. భవిష్యత్ ను చేజేతులా నాశనం చేసుకున్నారు. విజయవాడ సమీపంలోని పాయకాపురానికి చెందిన నలుగురు యువకులు బండి హేమంత్ కుమార్, ఇనుపకుర్తి రాంకీ, కొణతం రవి కుమార్, గంగిరెద్ది కృష్ణారెడ్డి వరుసగా దారి దోపిడీలకు పాల్పడుతున్నారు. కారు డ్రైవర్లుగా నటిస్తూ ప్రయాణీకులను మారు మూల ప్రాంతాలకు తీసుకెళ్ళి కత్తులతో బెదిరించి దోపిడీ చేస్తున్నారు. దారి దోపిడీలను అదుపు చేయడం కోసం సీసీఎస్ పోలీసులు గత కొంత కాలంగా స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నారు. బుధవారం స్థానిక సింగ్ నగర్ లోని పైపుల రోడ్డులో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఈ యువకులను అరెస్టు చేసి విచారించడంతో నిందితుల గుట్టు రట్టయ్యింది. వారి వద్ద నుంచి 2.5 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. వీరు చేసిన అనేక నేరాల గురించి పోలీసులు మీడియాకు వివరించారు. జనవరిలో బెంజి సర్కిల్ వద్ద ఓ యువకుడిని ఏలూరు తీసుకు వెళతామని కారులో ఎక్కించుకుని హనుమాన్ జంక్షన్ నుంచి నూజివీడు రోడ్డులోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకు వెళ్ళి కత్తితో బెదిరించి గొలుసు అపహరించారు. వారధి సమీపంలో మరొక వ్యక్తిని ఇదే మాదిరిగా బాపట్లకు మరొక యువకుడిని తీసుకు వెళుతూ తెనాలి సమీపంలో గొలుసులు, ఉంగరాలను లాక్కొన్నారు. బెంజి సర్కిల్ సమీపంలో కొట్యా నాయక్ అనే వ్యక్తిని గుడివాడ తీసుకెళుతూ నందమూరు క్రాస్ వద్ద ఇదే మాదిరిగా బంగారు ఆభరణాలు, సెల్ ఫోనులు, 16 వేల నగదు అపహరించారు.

Tags:    
Advertisement

Similar News