సెక్యూరిటీ లేని పోలీస్ స్టేషన్!
పోలీస్ స్టేషన్ కి సెక్యూరిటీ ఏమిటా అనుకుంటున్నారా? నిజమే ఆ పోలీస్ స్టేషన్ కి సెక్యూరిటీ లేదు. ఎక్కడ ఏమి జరిగినా మనం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తాం. కానీ పోలీస్ స్టేషన్ కే రక్షణ లేకపోతే ఇక వారు ప్రజలకి ఏమి రక్షణ కల్పిస్తారు? పోలీస్ స్టేషన్ లోనే దొంగలు పడి దోచుకు పోతే వారు ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఇలాంటి విచిత్రమైన, అత్యంత అవమానకరమైన పరిస్థితి చెన్నై పోలీసులకు ఎదురయ్యింది. చెన్నై లోని […]
పోలీస్ స్టేషన్ కి సెక్యూరిటీ ఏమిటా అనుకుంటున్నారా? నిజమే ఆ పోలీస్ స్టేషన్ కి సెక్యూరిటీ లేదు. ఎక్కడ ఏమి జరిగినా మనం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తాం. కానీ పోలీస్ స్టేషన్ కే రక్షణ లేకపోతే ఇక వారు ప్రజలకి ఏమి రక్షణ కల్పిస్తారు? పోలీస్ స్టేషన్ లోనే దొంగలు పడి దోచుకు పోతే వారు ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఇలాంటి విచిత్రమైన, అత్యంత అవమానకరమైన పరిస్థితి చెన్నై పోలీసులకు ఎదురయ్యింది. చెన్నై లోని మౌంట్ రోడ్డులో గల తేనాంపేట పోలీస్ స్టేషన్ అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం. అక్కడ అసిస్టెంట్ కమిషనర్ హోదా గలిగిన అధికారి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ పోలీస్ స్టేషన్ లోనే ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ విభాగం కూడా ఉంది. మంగళవారం విధులు నిర్వర్తించడానికి వచ్చిన సిబ్బంది ట్రాఫిక్ విభాగ కార్యాలయం తాళాలు పగలగొట్టి ఉండడాన్ని గమనించారు. లోనికి పోయి చూడగా ట్రాఫిక్ నియంత్రణకు ఉపయోగంచే ఏడు వాకీటాకీలు చోరీకి గురయినట్టు గుర్తించారు. ఏం చేయాలో పాలుపోని ట్రాఫిక్ పోలీసులు క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదండీ సంగతి. పోలీసులకు రక్షణ కావాలిగదా మరి…