అందరూ మెచ్చే విధంగా అమరావతి: చంద్రబాబు
రాజధాని అంటే ఇలా ఉండాలనే విధంగా ఆంధ్రప్రదేశ్ కేపిటల్ అమరావతిని నిర్మిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అత్యుత్తమ నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్న చంద్రబాబు బృందం సోమవారం చైనా సివిల్ ఇంజినీరింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధానితోపాటు మరో మూడు నగరాల నిర్మాణానికి సలహాలు కోరారు. పారిశ్రామిక, మౌలిక వసతుల అభివృద్ధికి తోడ్పాటును అందించాల్సిందిగా ఆయన చైనా కార్పొరేషన్‌ను […]
Advertisement
రాజధాని అంటే ఇలా ఉండాలనే విధంగా ఆంధ్రప్రదేశ్ కేపిటల్ అమరావతిని నిర్మిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అత్యుత్తమ నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్న చంద్రబాబు బృందం సోమవారం చైనా సివిల్ ఇంజినీరింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధానితోపాటు మరో మూడు నగరాల నిర్మాణానికి సలహాలు కోరారు. పారిశ్రామిక, మౌలిక వసతుల అభివృద్ధికి తోడ్పాటును అందించాల్సిందిగా ఆయన చైనా కార్పొరేషన్‌ను కోరారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, భారత్‌కు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే పర్యాటకులు రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా అన్ని వసతులు సమకూర్చడానికి, తగిన విధంగా మార్గదర్శనం చేయడానికి ఓ సంస్థను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపారు. రెండో రోజు పర్యటనలో ఆయన చైనా వైస్ ప్రీమియర్ వాంగ్‌యాంగ్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. బాబు నుంచి వివరాలు తెలుసుకున్న ఆయన మాట్లాడుతూ…రెందు దేశాలు అభివృద్ధే లక్ష్యంగా పయనించాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఆయన షియామీ, ఫాక్స్‌కాన్, సినోమా, సీమెన్, షంజన్, సుమిక్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోఎల్.ఈడీ, ఎలక్ట్రికల్, హార్డ్‌వేర్ రంగాల అభివృద్ధికి చేయూత అందించాల్సిందిగా కోరారు. ఎలక్ట్రానిక్, మొబైల్, నౌకాయాన రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి కొంతమంది పారిశ్రామిక వేత్తలు ఆసక్తి కనబరిచారు. అంతకుముందు మోడీ బీజింగ్ మేయర్‌ను భారత్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారు. తర్వాత చంద్రబాబు బీజింగ్ నుంచి హవాయి బయలు దేరారు.-పీఆర్
Advertisement