ఎన్‌కౌంటర్‌పై ఏంచేశారు: హైకోర్టు
శేషాచలం ఎన్‌కౌంటర్‌పై దాఖలు చేసిన ఫిర్యాదుపై ఏం చర్యలు తీసుకుందో తెలపాలంటూ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ ఎన్‌కౌంటర్ బూటకమని, దీనిపై తాము పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ పౌర హక్కుల సంఘం నేతలు హైకోర్టను ఆశ్రయించారు. తాము చేసిన ఫిర్యాదు కాపీని కూడా వారు హైకోర్టుకు సమర్పించారు. దీనిపై కోర్టు స్పందిస్తూ పోలీసు స్టేషన్‌లో ఉద్యమకారులు చేసిన ఫిర్యాదుపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని ఆదేశించింది. ఈకేసులో ఫిర్యాదు దారుడ్ని ప్రతివాదిగా […]
Advertisement
శేషాచలం ఎన్‌కౌంటర్‌పై దాఖలు చేసిన ఫిర్యాదుపై ఏం చర్యలు తీసుకుందో తెలపాలంటూ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ ఎన్‌కౌంటర్ బూటకమని, దీనిపై తాము పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ పౌర హక్కుల సంఘం నేతలు హైకోర్టను ఆశ్రయించారు. తాము చేసిన ఫిర్యాదు కాపీని కూడా వారు హైకోర్టుకు సమర్పించారు. దీనిపై కోర్టు స్పందిస్తూ పోలీసు స్టేషన్‌లో ఉద్యమకారులు చేసిన ఫిర్యాదుపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని ఆదేశించింది. ఈకేసులో ఫిర్యాదు దారుడ్ని ప్రతివాదిగా చేర్చింది. కేసును ఈనెల 15వ తేదీకి వాయిదా వేసింది. కాగా ఈ ఎన్‌కౌంటర్‌పై తమిళనాడులో నిరసనల సెగ ఆగలేదు. ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. గత వారం రోజుల నుంచి ఏపీకి చెందిన బస్సులేవీ తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళడం లేదు.-పీఆర్
Advertisement