డిమాండ్లు నెర‌వేర్చ‌క‌పోతే ఆర్టీసీలో స‌మ్మె త‌థ్యం

ఉద్యోగులను భయబ్రాంతులకు గురిచేసే ఉద్దేశంతోనే ఆర్టీసీలో సమ్మెలు నిషేధిస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసిందని ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్ (ఈయూ), తెలంగాణ మజ్దూర్‌ యూనియన్ (టీఎంయూ)ల ప్రధాన కార్యదర్శులు కె.పద్మాకర్‌, ఇ.అశ్వథామరెడ్డిలు ఆరోపించారు. పీఆర్‌సీ అమలు చేయక పోతే సమ్మె తప్పదని స్పష్టం చేశారు. నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ యాజమాన్యానికి తొత్తుగా మారడం వల్లే ఉద్యోగులకు వేతన సవరణ జాప్యం అవుతోందని ఆరోపించారు. ఆర్టీసీ ఉద్యోగులకు వేతన సవరణ చేపట్టాలంటూ ఇచ్చిన సమ్మె నోటీసుపై ఈ నెల […]

Advertisement
Update:2015-04-12 09:24 IST
ఉద్యోగులను భయబ్రాంతులకు గురిచేసే ఉద్దేశంతోనే ఆర్టీసీలో సమ్మెలు నిషేధిస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసిందని ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్ (ఈయూ), తెలంగాణ మజ్దూర్‌ యూనియన్ (టీఎంయూ)ల ప్రధాన కార్యదర్శులు కె.పద్మాకర్‌, ఇ.అశ్వథామరెడ్డిలు ఆరోపించారు. పీఆర్‌సీ అమలు చేయక పోతే సమ్మె తప్పదని స్పష్టం చేశారు. నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ యాజమాన్యానికి తొత్తుగా మారడం వల్లే ఉద్యోగులకు వేతన సవరణ జాప్యం అవుతోందని ఆరోపించారు. ఆర్టీసీ ఉద్యోగులకు వేతన సవరణ చేపట్టాలంటూ ఇచ్చిన సమ్మె నోటీసుపై ఈ నెల 13న లేబర్‌ కమిషనర్‌తో చర్చలు జరపనున్నట్లు ఇరు రాష్ర్టాల్లోని 1.2 లక్షల మంది ఉద్యోగులకు ఏప్రిల్‌ 2013 నుంచి వేతన సవరణ జరగాలన్నారు. రెండు రాష్ర్టాల్లోని ఉద్యోగులకు అమలు చేసిన తరహాలోనే తమకూ పీఆర్‌సీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. త‌మ డిమాండ్లు నెర‌వేర్చ‌క‌పోతే ఈనెల 16 తర్వాత ఏ క్షణంలో అయినా నిరవధిక సమ్మె ప్రారంభిస్తామని తెలిపారు.-పీఆర్
Tags:    
Advertisement

Similar News