ఇక సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు ఇక తమ తమ రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవలసిందే. డిప్యూటేషన్‌లో ఉన్నా, ఆన్‌డ్యూటీలో ఉన్నా గాని ఒక రాష్ట్రానికి చెందిన ఉద్యోగులు మరో రాష్ట్రంలో లోకల్ పోస్టుల్లో పని చేస్తుంటే వారిని తక్షణమే సొంత రాష్ట్రాలకు పంపించాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు ఐవైఆర్ కృష్ణారావు, రాజీవ్‌శర్మ సంయుక్తంగా ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. వాస్తవానికి లోకల్ పోస్టుల్లో అదే రాష్ట్రానికి చెందిన వారు […]
Advertisement
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు ఇక తమ తమ రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవలసిందే. డిప్యూటేషన్‌లో ఉన్నా, ఆన్‌డ్యూటీలో ఉన్నా గాని ఒక రాష్ట్రానికి చెందిన ఉద్యోగులు మరో రాష్ట్రంలో లోకల్ పోస్టుల్లో పని చేస్తుంటే వారిని తక్షణమే సొంత రాష్ట్రాలకు పంపించాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు ఐవైఆర్ కృష్ణారావు, రాజీవ్‌శర్మ సంయుక్తంగా ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. వాస్తవానికి లోకల్ పోస్టుల్లో అదే రాష్ట్రానికి చెందిన వారు మాత్రమే ఉండాలని రాష్ట్ర విభజనకు ఒక్కరోజు ముందు (అంటే గత ఏడాది జూన్ 1న) గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత సెప్టెంబర్ 26న మరోమారు కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. అయినప్పటికీ చాలామంది సొంత రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రంలో కొనసాగుతున్నట్లు గుర్తించారు. ఇలాంటి ఉద్యోగుల వివరాలను తెలంగాణకు చెందిన కొందరు శాఖాధిపతులు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఈ క్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య రెండుమార్లు చర్చలు జరిగాయి. విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలోనే ఇపుడయితేనే అందరికీ అనువుగా ఉంటుందన్న ఉద్దేశ్యంతో రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు ఈ ఉత్తర్వులు జారీ చేశారు.-పీఆర్
Advertisement