అమాయక కూలీలను చంపడం అన్యాయం: వైగో
అడవిలో జంతువును చంపాలన్నా అనుమతి తీసుకునిగాని ఆ పని చేయడానికి లేదు. కాని అమాయకులైన కూలీలను చంపడానికి మాత్రం చంద్రబాబు ప్రభుత్వం వెనుకాడలేదని వైగో ఆరోపించారు. చిత్తూరు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఆయన చంద్రబాబు ప్రభుత్వ చర్యలను తీవ్రంగా వైగో ఖండించారు. వైగో నేతృత్వంలోని నిరసనకారులు తమిళనాడు నుంచి చిత్తూరు కలెక్టరరేట్ మట్టడికి బయలుదేరారు. వారి రాకను నిరోధించడానికి పోలీసులు శతధా ప్రయత్నించారు. గాంధీపురం వద్ద పోలీసులు, వైగో అనుచరుల మధ్య భారీగా తోపులాట జురిగింది. […]
Advertisement
అడవిలో జంతువును చంపాలన్నా అనుమతి తీసుకునిగాని ఆ పని చేయడానికి లేదు. కాని అమాయకులైన కూలీలను చంపడానికి మాత్రం చంద్రబాబు ప్రభుత్వం వెనుకాడలేదని వైగో ఆరోపించారు. చిత్తూరు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఆయన చంద్రబాబు ప్రభుత్వ చర్యలను తీవ్రంగా వైగో ఖండించారు. వైగో నేతృత్వంలోని నిరసనకారులు తమిళనాడు నుంచి చిత్తూరు కలెక్టరరేట్ మట్టడికి బయలుదేరారు. వారి రాకను నిరోధించడానికి పోలీసులు శతధా ప్రయత్నించారు. గాంధీపురం వద్ద పోలీసులు, వైగో అనుచరుల మధ్య భారీగా తోపులాట జురిగింది. ఈ సంఘటనలో వైగో సృహ తప్పి పడిపోయారు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు.
మరోవైపు…ఎన్‌కౌంటర్‌పై తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం రాసిన లేఖకు జవాబుగా చంద్రబాబు ప్రతిస్పందించారు. ఇప్పటికే తాము జ్యూడిషియల్ విచారణకు ఆదేశించామని, మిగతా వివరాలు అందగానే తెలియజేస్తానని ఆయన తెలిపారు. కాగా ఎన్‌కౌంటర్లో మరణించిన వారి మృతదేహాలకు తిరిగి పోస్టుమార్టం చేయాలన్న తమిళనాయకుల వాదనను చెన్నై హైకోర్టు తిరస్కరించింది.-పీఆర్
Advertisement