బెజవాడ-బందరు రహదారిలో రాజకీయం

విజయవాడ, మచిలీపట్నం జాతీయ రహదారిని దారి మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉయ్యూరు వద్ద ప్రస్తుతం ఉన్న బైపాస్ ను విస్తరిస్తే సరిపోతుందని ప్రభుత్వం భావించింది. అయితే ఉయ్యూరు బైపాస్ ను అలాగే ఉంచి అక్కడ మరో బైపాస్ ను ఏర్పాటు చేయించేందుకు కొంతమంది పెద్దలు తెర వెనుక పావులు కదుపుతున్నారు. ఇదంతా రియల్టర్లు, భూములు కొనుగోలు చేసిన బడాబాబులు, పెద్ద రైతులు ఈ బైపాస్ కోసం లాబీయింగ్ చేస్తున్నారు. రియల్టర్ల ఒత్తిళ్లకు తలొగ్గి వ్యయభారం పెరిగే అవకాశం […]

Advertisement
Update:2015-04-10 04:33 IST

విజయవాడ, మచిలీపట్నం జాతీయ రహదారిని దారి మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉయ్యూరు వద్ద ప్రస్తుతం ఉన్న బైపాస్ ను విస్తరిస్తే సరిపోతుందని ప్రభుత్వం భావించింది. అయితే ఉయ్యూరు బైపాస్ ను అలాగే ఉంచి అక్కడ మరో బైపాస్ ను ఏర్పాటు చేయించేందుకు కొంతమంది పెద్దలు తెర వెనుక పావులు కదుపుతున్నారు. ఇదంతా రియల్టర్లు, భూములు కొనుగోలు చేసిన బడాబాబులు, పెద్ద రైతులు ఈ బైపాస్ కోసం లాబీయింగ్ చేస్తున్నారు. రియల్టర్ల ఒత్తిళ్లకు తలొగ్గి వ్యయభారం పెరిగే అవకాశం ఉంది.

విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిని తప్పించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ రహదారిని విస్తరించడాoనికి గతంలో నోటిఫికేషన్ విడుదలచేశారు. దాదాపు 80 శాతం భూసేకరణ కూడా పూర్తయింది. అక్కడక్కడా కొంత భూమిని సేకరించాల్సి ఉంది. విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు ఉన్న ఎన్.హెచ్-9 జాతీయ రహదారిని గండిగుంట వరకు 200 అడుగుల వరకు విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. ఈ ప్రాంతంలో చిన ఓగిరాల, వెంకటాపురం, ఉయ్యూరు గ్రామాలకు చెందిన రైతులకు ఎక్కువగా భూములున్నాయి. వీరిలో అధిక శాతం మంది భూములు ఇవ్వడంతో చాలా వరకు భూసేకరణ ప్రక్రియను పూర్తి చేశారు. ఉయ్యూరు వద్ద ప్రస్తుతం ఉన్న బైపాస్ ను విస్తరిస్తే సరిపోతుందని ప్రభుత్వం ఒక నిర్ణయానికొచ్చింది. అయితే ఈ రహదారిని విస్తరణ ఇష్టంలేని కొంతమంది రైతులు ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్ కు వ్యతిరేకంగా అప్పట్లో కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఉయ్యూరు బైపాస్ ను అలాగే ఉంచి జాతీయ రహదారి విస్తరణలో భాగంగా అక్కడ మరో బైపాస్ ను ఏర్పాటు చేయించేందుకు కొంతమంది పెద్దలు, పావులు కదుపుతున్నారు.

గండిగుంట సమీపంలోని 22.4 కిలోమీటర్ల నుంచి 26.1 కిలోమీటర్ల వరకు కొత్త బైపాస్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు సమాచారం. కుందేరు గ్రామానికి వెళ్లే రోడ్ నుంచి బైపాస్ ప్రారంభమై గండిగుంట శ్మాశాన వాటిక వరకు సాగుతుంది. అంతేకాక కొత్తగా ప్రతిపాదిస్తున్న బైసాస్ ను సారవంతమైన భూముల మీదుగా అనేక మలుపులు తిరుగుతూ వెళ్లే విధంగా రూపొందించారని తెలుస్తోంది. కొంతమంది రియల్టర్లు, భూములు కొనుగోలు చేసిన బడాబాబులు, పెద్ద రైతులు కలిసి స్వార్థ ప్రయోజనాలతో ఈ బైపాస్ కోసం లాబీయింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న బైపాస్ ను 200 అడుగులకు విస్తరిస్తే ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుంది. అలాకాకుండా రియల్టర్ల ఒత్తిళ్లకు తలొగ్గితే భారం పెరిగే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే భూమి ఇచ్చిన రైతులు, స్థానికులు కొత్త బైపాస్ ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ జాతీయ రహదారి విస్తరణను గతంలో పీపీపీ పద్ధతిలో చేపట్టడానికి నిర్ణయించారు. కాంట్రాక్ట్ పనులు అప్పగింత కూడా జరిగింది. అయితే టెండర్ పొందిన సంస్థ చాలా కాలంపాటు పనులు ప్రారంభించకపోవడంతో కేంద్ర ప్రభుత్వం టెండర్ ను రద్దు చేసింది. దాదాపు పదేళ్లుగా రోడ్ విస్తరణ పనులు పెండింగ్ లో ఉండడంతో నిర్మాణ వ్యయం తడిసిమోపెడయింది. ఈ పనిని చేపట్టడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఇప్పుడు జాతీయ రహదారుల అభివృద్ధి శాఖే విస్తరణను చేపట్టడానికి సిద్ధమవుతోంది.

 

 

Tags:    
Advertisement

Similar News