ప్రజానేతగా మోడీ పయనం ఎందుకోసం?
ఒకవైపు హిందుత్వ ఎజెండా అమలు ఇలా సాగుతుండగానే మరోవైపు మోడీ డిజిటల్ ఇండియా, స్వచ్ఛభారత్, మేక్ ఇన్ ఇండియా, జన్‌ధన్ యోజన, సంసద్ ఆదర్శ గ్రామ యోజన వంటి ఆకర్షణీయమైన పథకాలతో ఉత్తమ ప్రజానేతగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చన్న పశ్న్రకు.. ప్రఖ్యాత ఫ్రెంచ్ రాజకీయ శాస్త్రవేత్త, భారత రాజకీయాలపై పలు గ్రంథాలు రచించిన క్రిస్టఫే జఫర్‌లాట్ తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ‘‘వినూత్న విధానాల ద్వారా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించి […]
Advertisement
ఒకవైపు హిందుత్వ ఎజెండా అమలు ఇలా సాగుతుండగానే మరోవైపు మోడీ డిజిటల్ ఇండియా, స్వచ్ఛభారత్, మేక్ ఇన్ ఇండియా, జన్‌ధన్ యోజన, సంసద్ ఆదర్శ గ్రామ యోజన వంటి ఆకర్షణీయమైన పథకాలతో ఉత్తమ ప్రజానేతగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చన్న పశ్న్రకు.. ప్రఖ్యాత ఫ్రెంచ్ రాజకీయ శాస్త్రవేత్త, భారత రాజకీయాలపై పలు గ్రంథాలు రచించిన క్రిస్టఫే జఫర్‌లాట్ తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ‘‘వినూత్న విధానాల ద్వారా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించి వచ్చే ఎన్నికల్లో దేశప్రజల మనసుల్ని మరోసారి దోచుకోవడం మోదీ మొదటి వ్యూహం. అది వీలుకాని పక్షంలో హిందుత్వ ఎజెండాను అమలు చేసి దేశంలో మెజారిటీ వర్గం ప్రజల మద్దతు సంపాదించి మళ్లీ అధికారంలోకి రావడం ఆయన రెండోవ్యూహం’’ అని ఆయన విశ్లేషించారు.-పీఆర్
Advertisement