బాబు, కేసీఆర్‌కు ఆదాయ దెయ్యం ఆవహించింది: మైసూరా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులకు ఆదాయం అనే దెయ్యం ఆవహించిందని, అభివృద్ధిని పక్కన పెట్టి ఎప్పుడూ ఆదాయం… ఆదాయం అంటూ జపం చేస్తున్నారని వైకాపాలోని సీనియర్ రాజకీయ నాయకుడు ఎం.వి.మైసూరా రెడ్డి విమర్శించారు. ఇద్దరు కలిసి ప్రజల్ని మోసం చేస్తున్నారని, పన్నుల విధింపు, ఛార్జీల వసూలు, వ్యాట్ విధింపుల్లో ఇద్దరు సీఎంలూ పోటీ పడుతున్నారని, ప్రజలను పీడించే చర్యల్లో ఒకరికొకరు పోటీ పడుతున్నారని ఆయన విమర్శించారు. విభజన చట్టంలో ఎన్నో మార్పులు చేయాల్సి ఉందని, వాటిపై ఎవరూ కూడా […]
Advertisement
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులకు ఆదాయం అనే దెయ్యం ఆవహించిందని, అభివృద్ధిని పక్కన పెట్టి ఎప్పుడూ ఆదాయం… ఆదాయం అంటూ జపం చేస్తున్నారని వైకాపాలోని సీనియర్ రాజకీయ నాయకుడు ఎం.వి.మైసూరా రెడ్డి విమర్శించారు. ఇద్దరు కలిసి ప్రజల్ని మోసం చేస్తున్నారని, పన్నుల విధింపు, ఛార్జీల వసూలు, వ్యాట్ విధింపుల్లో ఇద్దరు సీఎంలూ పోటీ పడుతున్నారని, ప్రజలను పీడించే చర్యల్లో ఒకరికొకరు పోటీ పడుతున్నారని ఆయన విమర్శించారు. విభజన చట్టంలో ఎన్నో మార్పులు చేయాల్సి ఉందని, వాటిపై ఎవరూ కూడా దృష్టి పెట్టడం లేదని అన్నారు. హైదరాబాద్‌తో విడిపోయినందున ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో నష్టం జరిగిందని, హైదరాబాద్ ఆదాయాన్ని ఏపీ ప్రభుత్వం ఎందుకు అడగడం లేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు, కేసీఆర్‌ల వైఖరితో ప్రజలు విసిగి పోతున్నారని ఆయన అన్నారు. ఇక ఇరు రాష్ట్రాలకు వారధిగా పని చేయాల్సిన గవర్నర్ నరసింహన్ గుడులు, గోపురాల చుట్టూ తిరగడానికి సమయం వెచ్చిస్తున్నారని మైసూరా విమర్శించారు. ఇప్పటికైనా ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని అందుకు అనుగుణంగా సీఎంలు, గవర్నర్ నడుచుకోవాలని ఆయన హితవు పలికారు.-పీఆర్
Advertisement