7నుంచి మిషన్ ఇంద్రధనుష్
సరైన సమయంలో టీకాలు అందక వివిధ వ్యాధులతో మృత్యువాత పడుతున్న చిన్నారులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ ఇంద్రధనుష్ పథకాన్ని ఈ నెల 7వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఇందుకోసం కేంద్రం తెలంగాణలో ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలను, ఏపీలో తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, కర్నూలు, విశాఖపట్టణం జిల్లాలను ఎంపిక చేసింది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో వలస కూలీలు అత్యధిక సంఖ్యలో ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చుతో ఆ జిల్లాలో ఇంద్రధనుష్ కార్యక్రమాన్ని […]
Advertisement
సరైన సమయంలో టీకాలు అందక వివిధ వ్యాధులతో మృత్యువాత పడుతున్న చిన్నారులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ ఇంద్రధనుష్ పథకాన్ని ఈ నెల 7వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఇందుకోసం కేంద్రం తెలంగాణలో ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలను, ఏపీలో తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, కర్నూలు, విశాఖపట్టణం జిల్లాలను ఎంపిక చేసింది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో వలస కూలీలు అత్యధిక సంఖ్యలో ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చుతో ఆ జిల్లాలో ఇంద్రధనుష్ కార్యక్రమాన్ని అమలు చేయనుంది. తొలి విడతలో టీకాలు అందని బాలలను గుర్తించి వారి కోసం మే, జూన్, జూలై నెలల్లో ఏడవ తేదీ నుంచి వారం పాటు టీకాలు వేయించనున్నారు.-పీఆర్
Advertisement