మంత్రలూ అవినీతికి పాల్పడి బలికావద్దు: కేసీఆర్ హెచ్చరిక
‘‘మీరు నిర్వహించే శాఖల్లో ఎక్కడా అవినీతి లేకుండా చూసుకోండి. అవినీతికి పాల్పడితే సహించను. ఇప్పటికే అవినీతి ఆరోపణలతో ఒక మంత్రిని తప్పనిసరి పరిస్థితుల్లో తొలగించాల్సి వచ్చింది. ఇది చాలా బాధాకరం. అటువంటి పరిస్థితి ఎవరూ తెచ్చుకోవద్దు!’’…అని మంత్రులకు కేసీఆర్ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది.గురువారం తన క్యాంపు కార్యాలయంలో మంత్రులు, పార్లమెంటరీ సెక్రటరీలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆరుగంటలపాటు జరిగిన సుదీర్ఘ సమావేశంలో శాఖలు, పథకాల వారీగా సమీక్ష నిర్వహించారు. ‘‘క్షేత్ర స్థాయిలో పాలనపై పట్టు సాధించకపోతే […]
Advertisement
‘‘మీరు నిర్వహించే శాఖల్లో ఎక్కడా అవినీతి లేకుండా చూసుకోండి. అవినీతికి పాల్పడితే సహించను. ఇప్పటికే అవినీతి ఆరోపణలతో ఒక మంత్రిని తప్పనిసరి పరిస్థితుల్లో తొలగించాల్సి వచ్చింది. ఇది చాలా బాధాకరం. అటువంటి పరిస్థితి ఎవరూ తెచ్చుకోవద్దు!’’…అని మంత్రులకు కేసీఆర్ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది.గురువారం తన క్యాంపు కార్యాలయంలో మంత్రులు, పార్లమెంటరీ సెక్రటరీలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆరుగంటలపాటు జరిగిన సుదీర్ఘ సమావేశంలో శాఖలు, పథకాల వారీగా సమీక్ష నిర్వహించారు. ‘‘క్షేత్ర స్థాయిలో పాలనపై పట్టు సాధించకపోతే కష్టం. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లటంలో నిర్లక్ష్యం తగదు’’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు, పార్లమెంటరీ సెక్రటరీలకు స్పష్టం చేశారు. పార్లమెంటరీ కార్యదర్శుల జీతాలు, వేతనాలకు సంబంధించి త్వరలో జీవో విడుదల చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
దాదాపు సమావేశం మొత్తం ఉన్నతస్థాయి అధికారుల సమక్షంలో జరగగా… చివరి 45 నిమిషాలు మాత్రం అధికారులు వెళ్లాక, రాజకీయ అంశాలపై చర్చించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం… అధికారం చేపట్టిన 10 నెలల్లోనే దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ సర్కారు అనేక పథకాలను అమల్లోకి తెచ్చినప్పటికీ, క్షేత్రస్థాయి నుంచి ఆశించిన ఫలితాలు రావటం లేదని కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిసింది. ప్రభుత్వ పథకాలను ఎంతో మెరుగ్గా రూపొందించి, అమలు చేస్తున్నప్పటికీ ప్రజాదరణ పెద్దగా లభించడం లేదన్నారు. జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు తమ ఒక్క శాఖకే పరిమితం కావద్దని మంత్రులు, పార్లమెంటరీ సెక్రటరీలను ఆయన హెచ్చరించారు. సొంత శాఖపై పూర్తి పట్టు కలిగి ఉంటూనే, మిగిలిన శాఖలపైనా అవగాహన కలిగి ఉండాలని కేసీఆర్ నిర్దేశించారు.-పిఆర్
Advertisement