మూడో క‌న్ను నిద్ర‌పోయిందా?

సూర్యాపేట కాల్పులు సంఘ‌ట‌న‌లో నిందితుల‌ను ప‌ట్టుకోవ‌డంలో అత్యంత కీల‌క‌మైన సీసీ కెమెరాలు ఏ మాత్రం ఉప‌యోగ‌ప‌డం లేద‌న్న విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది.  కెమెరా దృశ్యాల్లో స్ప‌ష్ట‌త లేక‌పోవ‌డంలోనే అవి ఎంత చ‌క్క‌గా అమ‌ర్చారో స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఎందుకంటే సీసీ కెమెరాల్లో ఎక్క‌డా నిందితుల స్ప‌ష్ట‌మైన ముఖ చిత్రాలు క‌నిపించ‌డం లేదు. ప్ర‌ధానంగా బ‌య‌టకు వ‌చ్చిన విజువ‌ల్స్ రెండు సీసీ కెమెరాల్లోనివిగా తెలుస్తున్నాయి. వీటిల్లో ఎక్క‌డా కూడా స్ప‌ష్ట‌త లేదు. అంటే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయ‌డంలో అవ‌గాహ‌న లోప‌మే ఈ […]

Advertisement
Update:2015-04-03 07:03 IST
సూర్యాపేట కాల్పులు సంఘ‌ట‌న‌లో నిందితుల‌ను ప‌ట్టుకోవ‌డంలో అత్యంత కీల‌క‌మైన సీసీ కెమెరాలు ఏ మాత్రం ఉప‌యోగ‌ప‌డం లేద‌న్న విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది. కెమెరా దృశ్యాల్లో స్ప‌ష్ట‌త లేక‌పోవ‌డంలోనే అవి ఎంత చ‌క్క‌గా అమ‌ర్చారో స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఎందుకంటే సీసీ కెమెరాల్లో ఎక్క‌డా నిందితుల స్ప‌ష్ట‌మైన ముఖ చిత్రాలు క‌నిపించ‌డం లేదు. ప్ర‌ధానంగా బ‌య‌టకు వ‌చ్చిన విజువ‌ల్స్ రెండు సీసీ కెమెరాల్లోనివిగా తెలుస్తున్నాయి. వీటిల్లో ఎక్క‌డా కూడా స్ప‌ష్ట‌త లేదు. అంటే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయ‌డంలో అవ‌గాహ‌న లోప‌మే ఈ ప‌రిస్థితి కార‌ణ‌మ‌న్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎందుకంటే మామూలుగా బ‌స్‌స్టాండ్ అంటేనే జ‌నం ఎక్కువగా ఉంటార‌నేది ఎవ‌రికైనా తెలిసిన స‌త్యం. పైగా సూర్యాపేట లాంటి బ‌స్‌స్టాండ్‌లో బ‌స్సుల రాక‌పోక‌లు చాలా ఎక్కువ.‌. తెలుగు రాష్ట్రాల‌కు ఇదే ఒక‌రంగా సెంట‌ర్ పాయింట్‌.. అలాంటి బ‌స్‌స్టాండ్‌లో సీసీ కెమెరాలు ఎక్కువ‌గా పెట్టాలి. అది కూడా బ‌స్సులు ఆగే ఫ్లాట్‌ఫాం కూడా ద‌గ్గ‌ర ఉండాలి. సూర్యాపేట‌లో ఫ్లాట్‌ఫాంపై ఉన్నా అది ఒక్క‌టే ఉన్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. దాని వ‌ల్ల నిందితుల‌ను ముందు ప‌క్క నుంచి చూసే అవ‌కాశం లేకుండా పోయింది. బ‌స్టాండ్ మొత్తం ఐదే కెమెరాలు ఉన్నాయి. బ‌స్టాండ్ మొత్తం క‌వ‌ర‌య్యేలా పెట్టి ఉంటే… సీన్ ఆఫ్ అఫెన్స్ అంతా రికార్డ‌య్యేది. అస‌లు సీసీ కెమెరాల్లో ఎక్క‌డా హ‌డావిడిగా ఉన్న ప‌రిస్థితే లేదు. అంటే ముఖ్య‌మైన ప్రాంతాల్లో సీసీ కెమెరాల ప్రాధాన్యత ఎంత ఉందో ఈ ఒక్క ఘ‌ట‌న మ‌రోసారి రుజువు చేసింది.-ఎస్‌

 

Tags:    
Advertisement

Similar News