మిషన్ కాకతీయ కింద 1368 చెరువులు
తెలంగాణలో మిషన్ కాకతీయ పనులు వేగంగా జరుపుతున్నారు. హైదరాబాద్ మినహా మిగతా తొమ్మిది జిల్లాల్లో మొత్తం 1368 చెరువుల్లో ఈ పనులను చేపట్టారు. గురువారం 132 చెరువుల్లో పూడిక తీసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. వచ్చే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మరింత వేగిరం చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మిషన్ కాకతీయలో భాగంగా గురువారం నాటికి తెలంగాణాలోని ఆదిలాబాద్‌లోని 121, కరీంనగర్‌లో 137, వరంగల్‌లో 298, ఖమ్మంలో 281, నిజామాబాద్‌లో 101, మెదక్‌లో 153, రంగారెడ్డిలో 49, మహబూబ్‌నగర్‌లో 126, […]
Advertisement
తెలంగాణలో మిషన్ కాకతీయ పనులు వేగంగా జరుపుతున్నారు. హైదరాబాద్ మినహా మిగతా తొమ్మిది జిల్లాల్లో మొత్తం 1368 చెరువుల్లో ఈ పనులను చేపట్టారు. గురువారం 132 చెరువుల్లో పూడిక తీసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. వచ్చే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మరింత వేగిరం చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మిషన్ కాకతీయలో భాగంగా గురువారం నాటికి తెలంగాణాలోని ఆదిలాబాద్‌లోని 121, కరీంనగర్‌లో 137, వరంగల్‌లో 298, ఖమ్మంలో 281, నిజామాబాద్‌లో 101, మెదక్‌లో 153, రంగారెడ్డిలో 49, మహబూబ్‌నగర్‌లో 126, నల్గొండలో 102 చెరువుల్లో పూడిక తీత పనులు ప్రారంభమయ్యాయి.-పీఆర్
Advertisement