పుష్కరాల కోసం 13 కోట్లు విడుదల
ఈ ఏడాది జూలై 14 నుంచి 25 వరకు గోదావరి పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో వీటి నిర్వహణ ఏర్పాట్ల కోసం తెలంగాణ ప్రభుత్వం బుధవారం నాడు 13.47 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. పుష్కరాలు జరగనున్న ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో తాగునీటి వసతి, మరుగుదొడ్ల నిర్మాణానికి ఈ నిధులు వినియోగించనున్నారు. ఈ ఐదు జిల్లాల్లో మొత్తం 174 పనులు పూర్తి చేయనున్నారు. ఇందులో శాశ్వత ప్రాతిపదికన తాగునీటి సౌకర్యం కల్పించేందుకు 7.17 […]
Advertisement
ఈ ఏడాది జూలై 14 నుంచి 25 వరకు గోదావరి పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో వీటి నిర్వహణ ఏర్పాట్ల కోసం తెలంగాణ ప్రభుత్వం బుధవారం నాడు 13.47 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. పుష్కరాలు జరగనున్న ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో తాగునీటి వసతి, మరుగుదొడ్ల నిర్మాణానికి ఈ నిధులు వినియోగించనున్నారు. ఈ ఐదు జిల్లాల్లో మొత్తం 174 పనులు పూర్తి చేయనున్నారు. ఇందులో శాశ్వత ప్రాతిపదికన తాగునీటి సౌకర్యం కల్పించేందుకు 7.17 కోట్ల రూపాయలు, తాత్కాలిక ప్రాతిపదిక కింద 2.25 కోట్ల రూపాయలు, మరుగుదొడ్ల నిర్మాణం కోసం 4.05 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు.
Advertisement