ఆర్టీసీ సమ్మె సైరన్ మోగించింది.
ఆర్టీసీలోని రెండు సంఘాలు సమ్మె నోటీసు ఇచ్చాయి. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 16 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని ఎంప్లాయీస్ యూనియన్-, టీఎంయూ నేతలు హెచ్చరించాయి. బుధవారం బస్‌భవన్‌లో ఎండీ సాంబశివరావు, ఇతర ఈడీలతో వేతన సవరణపై బుధవారం జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మె నోటీసు ఇచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఫిట్‌మెంట్ ఇవ్వాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ ప్రస్తుతం భారీ నష్టాల్లో ఉన్నందున పరిస్థితి అర్ధం చేసుకోవాలని […]
Advertisement
ఆర్టీసీలోని రెండు సంఘాలు సమ్మె నోటీసు ఇచ్చాయి. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 16 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని ఎంప్లాయీస్ యూనియన్-, టీఎంయూ నేతలు హెచ్చరించాయి. బుధవారం బస్‌భవన్‌లో ఎండీ సాంబశివరావు, ఇతర ఈడీలతో వేతన సవరణపై బుధవారం జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మె నోటీసు ఇచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఫిట్‌మెంట్ ఇవ్వాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ ప్రస్తుతం భారీ నష్టాల్లో ఉన్నందున పరిస్థితి అర్ధం చేసుకోవాలని ఎండీ సాంబశివరావు కార్మికుల దృష్టికి తెచ్చారు. కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు ఫిట్‌మెంట్ ఇవ్వగా లేనిది తమకెందుకు అభ్యంతరం చెబుతున్నారని ఎంప్లాయిస్ యూనియన్, టీఎంయూ సభ్యులు ప్రశ్నించారు. దీంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించకుండా హామీ ఇవ్వలేమని ఎండీ స్పష్టం చేశారు. ఈ నెల 9 లోపు ప్రభుత్వాలను సంప్రదించి నిర్ణయం చెబుతానని ఆయన తెలిపారు. సమ్మె నోటీసు ఇవ్వడానికి ముందు సుందరయ్య పార్క్ నుంచి బస్ భవన్ వరకు ఉద్యోగులంతా ర్యాలీ నిర్వహించారు. కొంచెం సేపు అక్కడ ధర్నా చేసి బస్‌భవన్‌ను ముట్టడించారు. అనంతరం అధికారులకు సమ్మె నోటీసు ఇచ్చారు.-పీఆర్
Advertisement