కుడితిలో పడ్డ ఎలుక... పాపం శివాజీ!
గత సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేసిన సినీ హీరో శివాజీ ఇపుడు బీజేపీలో లేరట. తాను బీజేపీ సభ్యుడినైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని పోరాడుతుంటే రాష్ట్ర విభజన సందర్భంగా హామీలు గుప్పించిన వివిధ పార్టీల్లోని నాయకులు ఎందుకు పెదవి విప్పటం లేదని ఆయన అనేకసార్లు, అనేక సందర్భాల్లో, అనేక సభల్లో నొక్కి వక్కాణించారు. అలాంటి శివాజీ ఇపుడు బీజేపీలో లేరంటే నమ్ముతారా? నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే బీజేపీ జాతీయ నాయకుడు సోము […]
Advertisement
గత సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేసిన సినీ హీరో శివాజీ ఇపుడు బీజేపీలో లేరట. తాను బీజేపీ సభ్యుడినైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని పోరాడుతుంటే రాష్ట్ర విభజన సందర్భంగా హామీలు గుప్పించిన వివిధ పార్టీల్లోని నాయకులు ఎందుకు పెదవి విప్పటం లేదని ఆయన అనేకసార్లు, అనేక సందర్భాల్లో, అనేక సభల్లో నొక్కి వక్కాణించారు. అలాంటి శివాజీ ఇపుడు బీజేపీలో లేరంటే నమ్ముతారా? నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే బీజేపీ జాతీయ నాయకుడు సోము వీర్రాజే స్వయంగా ఈ ప్రకటన చేశారు కాబట్టి నమ్మాలి. అనేక విషయాల్లో బీజేపీ ప్రతినిధిగా ఆవేశంగా, ఆవేదనగా కూడా ఆయన మాట్లాడారు. అంతేకాకుండా, తన వెనుక బీజేపీ ఉందన్న ధైర్యంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ తాను అయిపోతానని కూడా అనుకున్నారు. అయితే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, శివాజీ ప్రస్తుతం బీజేపీలో లేరట… శివాజీకి, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదట. ఈ విషయాన్ని బీజేపీ జాతీయ నాయకుడు సోము వీర్రాజు ఢిల్లీలో ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో నటుడు శివాజీ పదేపదే ప్రకటనలు చేస్తూ మీడియాకి ఎక్కుతున్నారని, అయితే బీజేపీకి, ఆయనకు ఎలాంటి సంబంధం లేదని, ఆయన చేసే ప్రకటనలను ఆయన వ్యక్తిగత ప్రకటనలుగా భావించాలని సోము వీర్రాజు స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని ఇబ్బంది పెట్టే ప్రకటనలు చేస్తే రాజకీయ నాయకులకు మండదా? పాపం శివాజీకి ఇంకా రాజకీయాలు వంట బట్టినట్టు లేవనడానికి ఇంతకన్నా కారణం ఏం కావాలి?-పిఆర్
Advertisement