తెలంగాణలోనూ రోజంతా విద్యుత్ వెలుగులు
తెలంగాణలోనూ రోజంతా విద్యుత్ వెలుగు పూలు పూయించేందుకు రంగం సిద్ధమవుతోంది. నిరంతరం విద్యుత్ కోసం ఇప్పటికే ఎంపిక చేసిన ఢిల్లీ, రాజస్థాన్, ఏపీ సరసన తెలంగాణనూ చేర్చేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో నెలకొన్న విద్యుత్తు కొరతను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఉదారంగా వ్యవహరించాలని, విద్యుత్తు పథకాలకు ఇతోధికంగా నిధులు ఇవ్వాలని, ఆ రాష్ట్రంలో చేపట్టే కొత్త విద్యుత్కేంద్రాలకు సాయమందించాలని ప్రధాని నరేంద్ర మోడీకి కేసీఆర్ ఇటీవలే లేఖ రాశారు. ఈ నేపథ్యంలో […]
Advertisement
తెలంగాణలోనూ రోజంతా విద్యుత్ వెలుగు పూలు పూయించేందుకు రంగం సిద్ధమవుతోంది. నిరంతరం విద్యుత్ కోసం ఇప్పటికే ఎంపిక చేసిన ఢిల్లీ, రాజస్థాన్, ఏపీ సరసన తెలంగాణనూ చేర్చేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో నెలకొన్న విద్యుత్తు కొరతను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఉదారంగా వ్యవహరించాలని, విద్యుత్తు పథకాలకు ఇతోధికంగా నిధులు ఇవ్వాలని, ఆ రాష్ట్రంలో చేపట్టే కొత్త విద్యుత్కేంద్రాలకు సాయమందించాలని ప్రధాని నరేంద్ర మోడీకి కేసీఆర్ ఇటీవలే లేఖ రాశారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో పరిస్థితి సమీక్షించేందుకు కేంద్ర ఇంధన శాఖ సంయుక్త కార్యదర్శి జ్యోతి అరోరా నేతృత్వంలోని కేంద్ర అధికారులు సచివాలయంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్తు కొరత, ప్రభుత్వం కొత్తగా చేపడుతోన్న కొత్త ప్లాంట్ల గురించి రాజీవ్ శర్మ వివరించారు. ఈ పరిస్థితులపై జ్యోతి అరోరా బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్రం తమ రాష్ట్రానికి కూడా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని అధికారులు కోరగా కేంద్ర బృందం సూత్రప్రాయంగా అంగీకరించింది.-పిఆర్
Advertisement