ఇక ఏపీ నుంచి వచ్చే వాహనాలకూ రవాణా పన్నుపోటు!
హైదరాబాద్ : తెలంగాణలో కొత్త రవాణా పన్ను విధానం అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇకనుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వాహనాలకు సైతం రవాణా పన్ను విధిస్తారు. గతంలో రవాణా పన్నుపై హైకోర్టు విధించిన గడువు రేపటితో ముగియనుండడంతో ప్రభుత్వం ఇపుడీ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఇప్పటి నుంచి ఏపీతో సహా ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే వాహనాలపై రవాణా పన్ను విధిస్తారు. అయితే నేషనల్ పర్మిట్ ఉన్న వాహనాలకు ఈ ఉత్తర్వులు […]
Advertisement
హైదరాబాద్ : తెలంగాణలో కొత్త రవాణా పన్ను విధానం అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇకనుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వాహనాలకు సైతం రవాణా పన్ను విధిస్తారు. గతంలో రవాణా పన్నుపై హైకోర్టు విధించిన గడువు రేపటితో ముగియనుండడంతో ప్రభుత్వం ఇపుడీ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఇప్పటి నుంచి ఏపీతో సహా ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే వాహనాలపై రవాణా పన్ను విధిస్తారు. అయితే నేషనల్ పర్మిట్ ఉన్న వాహనాలకు ఈ ఉత్తర్వులు మినహాయింపు ఇస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వాహనాలను సైతం ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వాహనాల మాదిరిగానే పరిగణించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే రాష్ట్ర విభజన సమయంలో పదేళ్ళపాటు వాహనాలకు పన్నులు వర్తించవని, రిజిస్ట్రేషన్ మార్చుకోవలసిన అవసరం లేదని ఇచ్చిన హామీలు ఏమేరకు వర్తిస్తాయో వేచి చూడాలి. దీనిపై ఎవరైనా కోర్టుకు వెళితే ప్రస్తుతం జారీ చేసిన ఉత్తర్వులు ఎంతవరకు నిలుస్తాయన్నది అసలు ప్రశ్న!-పిఆర్
Advertisement