ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌ర్ గంగిరెడ్డిని ఏపీకి ర‌ప్పిస్తాం: డీజీపీ

ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌ర్ గంగిరెడ్డిని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర డీజీపీ జె.వి.రాముడు తెలిపారు. మారిష‌స్ కోర్టులో వ‌చ్చేనెల 7న గంగిరెడ్డి విచార‌ణ జ‌రుగుతుంద‌ని, అది పూర్త‌యిన త‌ర్వాత ఆత‌న్ని త‌మ‌కు అప్ప‌గించాల్సిందిగా ఆ కోర్డును అభ్య‌ర్థిస్తామ‌ని ఆయ‌న చెప్పారు. ఎర్ర‌చంద‌నం  అక్ర‌మ ర‌వాణ‌, రోడ్డు ప్ర‌మాదాల నివార‌ణ‌ల‌పై త‌మ పోలీసు శాఖ ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టింద‌ని, ఈరెండు అంశాలే ల‌క్ష్యాలుగా సిబ్బంది ప‌ని చేస్తార‌ని ఆయ‌న అన్నారు. న‌ల్ల‌మ‌ల అడ‌వుల్లో మావోయిస్టుల ప్ర‌భావం ఏ […]

Advertisement
Update:2015-03-30 10:09 IST

ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌ర్ గంగిరెడ్డిని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర డీజీపీ జె.వి.రాముడు తెలిపారు.
మారిష‌స్ కోర్టులో వ‌చ్చేనెల 7న గంగిరెడ్డి విచార‌ణ జ‌రుగుతుంద‌ని, అది పూర్త‌యిన త‌ర్వాత ఆత‌న్ని త‌మ‌కు అప్ప‌గించాల్సిందిగా ఆ కోర్డును అభ్య‌ర్థిస్తామ‌ని ఆయ‌న చెప్పారు. ఎర్ర‌చంద‌నం అక్ర‌మ ర‌వాణ‌, రోడ్డు ప్ర‌మాదాల నివార‌ణ‌ల‌పై త‌మ పోలీసు శాఖ ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టింద‌ని, ఈరెండు అంశాలే ల‌క్ష్యాలుగా సిబ్బంది ప‌ని చేస్తార‌ని ఆయ‌న అన్నారు. న‌ల్ల‌మ‌ల అడ‌వుల్లో మావోయిస్టుల ప్ర‌భావం ఏ మాత్రం లేద‌ని రాముడు స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లకు ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా ఉండేందుకు త‌మ శాఖ చాలా అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని డి.జి.పి. రాముడు తెలిపారు-పిఆర్‌

Tags:    
Advertisement

Similar News