ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్‌పై ఉక్కుపాదం

ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్‌పై అటు రాష్ట్ర ప్ర‌భుత్వం, కేంద్ర ప్ర‌భుత్వం కూడా సీరియ‌స్‌గా దృష్టి సారించిన‌ట్టు క‌నిపిస్తున్నాయి. ఈ స్మ‌గ్లింగ్‌ను అరిక‌ట్ట‌డానికి అధిక ప్రాధాన్య‌త ఇస్తామ‌ని డీజీపీ జె.వి.రాముడు చేసిన ప్ర‌క‌ట‌న‌ను నిజం చేస్తూ… చిత్తూరు జిల్లాలో 14 మంది ఎర్రచందనం స్మగ్లర్లను జిల్లా ఎస్పీ శ్రీనివాస్ అరెస్ట్ చేశారు. స్మగ్లర్ల నుంచి రూ.70 లక్షల విలువల గల 38 ఎర్రచందనం దుంగలతోపాటు నాలుగు కార్లు, రెండు స్కూటర్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.  రాష్ట్ర పోలీసు అధికారులే కాకుండా […]

Advertisement
Update:2015-03-30 11:01 IST

ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్‌పై అటు రాష్ట్ర ప్ర‌భుత్వం, కేంద్ర ప్ర‌భుత్వం కూడా సీరియ‌స్‌గా దృష్టి సారించిన‌ట్టు క‌నిపిస్తున్నాయి. ఈ స్మ‌గ్లింగ్‌ను అరిక‌ట్ట‌డానికి అధిక ప్రాధాన్య‌త ఇస్తామ‌ని డీజీపీ జె.వి.రాముడు చేసిన ప్ర‌క‌ట‌న‌ను నిజం చేస్తూ… చిత్తూరు జిల్లాలో 14 మంది ఎర్రచందనం స్మగ్లర్లను జిల్లా ఎస్పీ శ్రీనివాస్ అరెస్ట్ చేశారు. స్మగ్లర్ల నుంచి రూ.70 లక్షల విలువల గల 38 ఎర్రచందనం దుంగలతోపాటు నాలుగు కార్లు, రెండు స్కూటర్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. రాష్ట్ర పోలీసు అధికారులే కాకుండా కేంద్రం కూడా ఈవిష‌యంలో చాలా ప‌ట్టుద‌ల‌గా ఉందన‌డానికి ఎర్ర చందనం స్మగ్లింగ్‌కు చెక్‌పెడతామని కేంద్రమంత్రి ప్రకాష్‌ జవదేకర్ చేసిన ప్ర‌క‌ట‌న కూడా ఊతం ఇస్తుంది. శేషాచల అడవుల నుంచి ఎర్రచందనం తరలిపోకుండా ఏపీ ప్రభుత్వంతో కలిసి పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నామ‌న్నారు. ఆయ‌న తిరుమ‌ల వ‌చ్చిన సంద‌ర్భంగా ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. శేషాచల అడవుల్లో తరచూ జరుగుతున్న అగ్నిప్రమాదాల నివారణకూ పటిష్ఠ చర్యలు తీసుకుంటామన్నారు. తనకు శ్రీవేంకటేశ్వరస్వామి అంటే చాలా ఇష్టమని, అందుకే స్వామివారిని ఎన్నిసార్లు దర్శించుకున్నా.. తనివి తీరదన్నారు.
వేలానికి 3,500 మెట్రిక్‌ టన్నుల ఎర్రచందనం సిద్ధం
ఆన్‌లైన్‌లో వేలానికి 3,500 మెట్రిక్‌ టన్నుల ఎర్రచందనం దుంగలు సిద్ధంగా ఉన్నాయని అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. తిరుపతి సీడబ్ల్యూసీ గోడౌన్‌ వద్ద ఉన్న ఎర్రచందనం స్టాకును మంత్రి పరిశీలించారు. ఈస్టాకును కేటగిరీ పరంగా వీటిని ఎం.సి.టి.ఎస్‌ సంస్థ ద్వారా ఆన్‌లైన్‌లో వేలం వేయ‌నున్న‌ట్టు ఆయ‌న తెలిపారు.-పిఆర్‌

Tags:    
Advertisement

Similar News