ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న రహస్య డాక్యుమెంట్లు!
అంతర్జాలం అనేక రహస్యాలను బయట పెడుతున్న నేపథ్యంలో అందరూ ఎంతో జాగ్రత్తగా ఉండడం అలవాటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా రహస్యంగా ఉంచాల్సిన విషయాలను చాలా భద్రంగా దాచుకుంటున్నారు. వ్యక్తిగత విషయాలను, బాహ్య ప్రపంచానికి తెలియకూడదనుకున్న విషయాలను చాలా భద్రంగా ఉంచుకుంటున్నారు. అయితే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళాల్సి ఉన్న సమాచారం ఇస్తే తప్ప ముందుకు వెళ్ళే పరిస్థితి ఉండదు. అలాంటి విషయాల్లో ప్రభుత్వాధినేతలే కాదు, అధికారులు కూడా తమ విషయాలను వెల్లడించాల్సి ఉంటుంది. ఇలా ఇచ్చిన […]
అంతర్జాలం అనేక రహస్యాలను బయట పెడుతున్న నేపథ్యంలో అందరూ ఎంతో జాగ్రత్తగా ఉండడం అలవాటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా రహస్యంగా ఉంచాల్సిన విషయాలను చాలా భద్రంగా దాచుకుంటున్నారు. వ్యక్తిగత విషయాలను, బాహ్య ప్రపంచానికి తెలియకూడదనుకున్న విషయాలను చాలా భద్రంగా ఉంచుకుంటున్నారు. అయితే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళాల్సి ఉన్న సమాచారం ఇస్తే తప్ప ముందుకు వెళ్ళే పరిస్థితి ఉండదు. అలాంటి విషయాల్లో ప్రభుత్వాధినేతలే కాదు, అధికారులు కూడా తమ విషయాలను వెల్లడించాల్సి ఉంటుంది. ఇలా ఇచ్చిన సమాచారం ఇపుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఇంటర్నెట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడితోపాటు పలువురు నాయకుల అంశాలు, కీలక డాక్యుమెంట్లు కనిపిస్తున్నాయి. ప్రపంచ నాయకుల వివరాలను పొరపాటున ఇంటర్నెట్‌లో పెట్టినట్టు ఆస్ట్రేలియా అధికారులు ప్రకటించారు. ఇంటర్నెట్‌లో కనిపిస్తున్న వాటిలో పలువురి నాయకుల పాస్‌పోర్టులు, ప్రయాణ వివరాలు, పలు వ్యక్తిగత అంశాలు ఉన్నాయి. గత యేడాది నవంబర్‌లో జి-20 సదస్సుకు హాజరైన వారి వివరాలన్నీ ఈ అంతర్జాలంలో దర్శనమిస్తున్నాయి.-పిఆర్