స్పీకర్‌పై అవిశ్వాసం ఉపసంహరణ: ప‌్రత్యేక అసెంబ్లీ రద్దు
తాము ఎంతో బాధ పడినందువల్లే స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వాల్సి వచ్చిందని విధానసభలో ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్. జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వంలోని కొంతమంది మంత్రులు, సభ్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా స్పీకర్‌గా వారిని అదుపు చేయకపోగా తమ సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, దాంతో బాధకు గురైన తాము అవిశ్వాస నోటీసు ఇచ్చామని ఆయన అన్నారు. ఆ రోజు స్పీకర్‌గా మీరు వ్యవహరించిన తీరు బాధ కలిగించింది. మాకున్న 67 మందితో మిమ్మల్ని తొలగించలేమన్న విషయం మాకు […]
Advertisement
తాము ఎంతో బాధ పడినందువల్లే స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వాల్సి వచ్చిందని విధానసభలో ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్. జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వంలోని కొంతమంది మంత్రులు, సభ్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా స్పీకర్‌గా వారిని అదుపు చేయకపోగా తమ సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, దాంతో బాధకు గురైన తాము అవిశ్వాస నోటీసు ఇచ్చామని ఆయన అన్నారు. ఆ రోజు స్పీకర్‌గా మీరు వ్యవహరించిన తీరు బాధ కలిగించింది. మాకున్న 67 మందితో మిమ్మల్ని తొలగించలేమన్న విషయం మాకు తెలుసు. అయినా మా బాధను తెలిపేందుకు మరో అవకాశం లేకే అలా చేశామని జగన్ అన్నారు. నిజానికి స్పీకర్‌గా మిమ్మల్ని ఎంపిక చేసినపుడు బేషరతుగా మేము మద్దతు ప్రకటించామని, మీరు ఎన్నికైన తర్వాత మీ స్థానం వరకు వచ్చి సీటులో కూర్చోబెట్టామని, అంత నమ్మకం మీమీద మాకు ఉందని, కాని ఇది సడలిన స్థితిలోనే తాము అవిశ్వస తీర్మానాన్ని ప్రతిపాదించామని అన్నారు. తమను అవిశ్వాస తీర్మానం ఉపసంహరించుకోవలసిందిగా బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్ రాజు మధ్యవర్తిత్వం వహించారని, రాబోయే రోజుల్లో తమ పట్ల పక్షపాత రహితంగా వ్యవహరిస్తారన్న నమ్మకంతో, తాము బాధ పడకుండా చూసుకుంటారనే అశతో అవిశ్వాస తీర్మానం ఉపసంహరించుకోడానికి సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. దీంతో జరిగిన పరిణామాలకు విచారం వ్యక్తం చేస్తూ అవిశ్వాస తీర్మానంపై చర్చ కోసం వచ్చెనెల 4వ తేదీన ఏర్పాటు చేసిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని రద్దు చేస్తున్నట్టు స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రకటించారు. – పి.ఆర్.
Advertisement