గంగిరెడ్డికి ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేల అండ!

ఎర్ర చందనం స్మగ్లర్‌ గంగిరెడ్డికి సంబంధించిన కీలక సమాచారాన్ని పోలీసులు సేకరించారు. మారిషస్‌లో ఉన్న గంగిరెడ్డికి ఎప్పటికప్పుడు రాయలసీమకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఆర్ధిక సాయం చేసినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. వైసీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు గంగిరెడ్డితో సన్నిహితంగా ఉంటున్నారని, అతనికి కావాల్సిన అన్ని అవసరాల కోసం డబ్బులు ఎప్పటికికప్పుడు మారిషస్‌కు పంపిస్తున్నారని వీరు తెలుసుకున్నారు. గంగిరెడ్డి పట్టుపడడంతో ఇద్దరు ఎమ్మెల్యేల బాగోతం బయట పడింది. ఒక మధ్యవర్తిని ఏర్పాటు చేసుకుని గంగిరెడ్డికి కావలిసిన డబ్బును […]

Advertisement
Update:2015-03-27 05:40 IST

ఎర్ర చందనం స్మగ్లర్‌ గంగిరెడ్డికి సంబంధించిన కీలక సమాచారాన్ని పోలీసులు సేకరించారు. మారిషస్‌లో ఉన్న గంగిరెడ్డికి ఎప్పటికప్పుడు రాయలసీమకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఆర్ధిక సాయం చేసినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. వైసీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు గంగిరెడ్డితో సన్నిహితంగా ఉంటున్నారని, అతనికి కావాల్సిన అన్ని అవసరాల కోసం డబ్బులు ఎప్పటికికప్పుడు మారిషస్‌కు పంపిస్తున్నారని వీరు తెలుసుకున్నారు. గంగిరెడ్డి పట్టుపడడంతో ఇద్దరు ఎమ్మెల్యేల బాగోతం బయట పడింది. ఒక మధ్యవర్తిని ఏర్పాటు చేసుకుని గంగిరెడ్డికి కావలిసిన డబ్బును ఎమ్మెల్యేలు పంపించేవారని, బ్యాంక్‌ అకౌంట్‌ ద్వారా డబ్బులు పంపిస్తే పోలీసులకు అనుమానం వస్తుందని, మధ్యవర్తి ద్వారా డబ్బు పంపించేవారిని పోలీసులు దర్యాప్తులో తేలింది. మారిషస్‌లో గంగిరెడ్డి కేసు విచారణ జరుగుతున్న సమయంలో అతని కోసం ఎవరెవరు వస్తున్నారో అన్నదానిపై కూడా పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసులు కంటపడగా అతని గురించి ఆరా తీశారు. అతను గతంలో వైసీపీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతను రాయలసీమ వైసీపీ ఎమ్మెల్యేలకు అనుచరుడుగా పనిచేస్తున్నట్లు వెల్లడైంది. గంగిరెడ్డిని ఇండియాకు తీసుకురావడానికి ఆంధ్రా పోలీసులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. రాయలసీమ ఎమ్మెల్యేలపై కూడా పోలీసులు దృష్టి పెట్టారు. వీరితోపాటు ఇంకా ఎవరైనా ఉన్నారా? అన్న దిశలో కూడా పోలీసులు దృష్టి సారించారు. గంగిరెడ్డిని విదేశాలకు పంపడానికి కూడా ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు అన్ని విధాలుగా సాయం చేసినట్టు తెలుస్తోంది. – పి.ఆర్‌.

Tags:    
Advertisement

Similar News