ఏపీలో ఐ-క్లిక్‌: డీజీపీ రాముడు

ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో మహిళల భద్రత కోసం రూపొందించిన ఐ-క్లిక్‌ విధానాన్ని అమలు చేయబోతున్నామని డీజీపీ జేవీ రాముడు తెలిపారు. దీని ద్వారా బాధితులు పోలీసుస్టేషన్లకు వెళ్లకుండానే ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. రెండు నెలల కిందట విశాఖపట్టణంలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేసి విజయం సాధించామన్నారు. ఐ-క్లిక్‌ విధానాన్ని త్వరలో గుంటూరు, నెల్లూరు, ఒంగోలు పట్టణాలలో కూడా ప్రారంభిస్తామన్నారు. ఐ-క్లిక్‌ విధానం ద్వారా ఇప్పటివరకు 45 ఫిర్యాదులు అందాయని, ఇందులో 22 ఫిర్యాదులకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు […]

Advertisement
Update:2015-03-26 06:19 IST

ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో మహిళల భద్రత కోసం రూపొందించిన ఐ-క్లిక్‌ విధానాన్ని అమలు చేయబోతున్నామని డీజీపీ జేవీ రాముడు తెలిపారు. దీని ద్వారా బాధితులు పోలీసుస్టేషన్లకు వెళ్లకుండానే ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. రెండు నెలల కిందట విశాఖపట్టణంలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేసి విజయం సాధించామన్నారు. ఐ-క్లిక్‌ విధానాన్ని త్వరలో గుంటూరు, నెల్లూరు, ఒంగోలు పట్టణాలలో కూడా ప్రారంభిస్తామన్నారు. ఐ-క్లిక్‌ విధానం ద్వారా ఇప్పటివరకు 45 ఫిర్యాదులు అందాయని, ఇందులో 22 ఫిర్యాదులకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని తెలిపారు. ఐ-క్లిక్‌ పద్ధతి ద్వారా వచ్చిన ఫిర్యాదులు సమీపంలోని పోలీస్‌స్టేషన్‌తోపాటు, డీజీపీ కార్యాలయానికి కూడా చేరతాయి కాబట్టి ఈ ఫిర్యాదులపై తీసుకోవాల్సిన చర్యలను సంబంధిత పోలీసు అధికారులతోపాటు డీజీపీ కార్యాలయం కూడా పర్యవేక్షిస్తుందని తెలిపారు.

Tags:    
Advertisement

Similar News