ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై బాబు అసహనం

తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు ఎలా ఉందో కాని నేను అవమానంగా పీలవుతున్నానని ఆయన గోదావరి జిల్లా నాయకులతో అన్నారు. అభ్యర్థి ఎంపికలో పొరపాటు జరిగినా, మీరు రాజీ పడకుండా పని చేయాల్సిందని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుని పని చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని ఆయన అన్నారు. అసెంబ్లీలో అధికార పార్టీ పనితీరు మెరుగు పడిందంటూ… ఇసుకపై కాంగ్రెస్‌ […]

Advertisement
Update:2015-03-26 03:52 IST

తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు ఎలా ఉందో కాని నేను అవమానంగా పీలవుతున్నానని ఆయన గోదావరి జిల్లా నాయకులతో అన్నారు. అభ్యర్థి ఎంపికలో పొరపాటు జరిగినా, మీరు రాజీ పడకుండా పని చేయాల్సిందని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుని పని చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని ఆయన అన్నారు. అసెంబ్లీలో అధికార పార్టీ పనితీరు మెరుగు పడిందంటూ… ఇసుకపై కాంగ్రెస్‌ పాలనలో ఏడాదికి రూ. 60 కోట్లు ఆదాయం వచ్చేదని, ఇప్పడు కొత్త పాలసీ కారణంగా ఐదు నెలల్లోనే రూ. 320 కోట్ల ఆదాయం వస్తోందని అన్నారు. ఈ ఆదాయాన్ని చూపించి, బ్యాంకుల నుంచి రుణం తీసుకుందామని, ఆ రుణంతో డ్వాక్రా రుణాలు మాఫీ చేద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

Tags:    
Advertisement

Similar News