హైకోర్టు హైదరాబాద్‌లో వద్దు: ఎపీ అడ్వకేట్స్
ఢిల్లీ: సత్వర కేసుల పరిష్కారానికి, ప్రజలకు అనుకూలంగా ఉండడానికి వీలుగా తక్షణం హైకోర్టును ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులు డిమాండు చేశారు. బుధవారం ఢిల్లీలోని కేంద్ర మంత్రులు ఎం. వెంకయ్యనాయుడు, సదానందగౌడలను కలిసిన సందర్భంలో విభజన సందర్భంలో కేంద్రం ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. హైదరాబాద్‌లో హైకోర్టు ఏర్పాటు తగదని, ఇంకో రాష్ట్ర రాజధానిలో వేరే రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు చేయడానికి రాజ్యాంగం అంగీకరించదని వారు గుర్తు చేశారు. హైకోర్టు […]
Advertisement
ఢిల్లీ: సత్వర కేసుల పరిష్కారానికి, ప్రజలకు అనుకూలంగా ఉండడానికి వీలుగా తక్షణం హైకోర్టును ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులు డిమాండు చేశారు. బుధవారం ఢిల్లీలోని కేంద్ర మంత్రులు ఎం. వెంకయ్యనాయుడు, సదానందగౌడలను కలిసిన సందర్భంలో విభజన సందర్భంలో కేంద్రం ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. హైదరాబాద్‌లో హైకోర్టు ఏర్పాటు తగదని, ఇంకో రాష్ట్ర రాజధానిలో వేరే రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు చేయడానికి రాజ్యాంగం అంగీకరించదని వారు గుర్తు చేశారు. హైకోర్టు అనేది ఏపీలో 13 జిల్లాల్లోని ఏదో ఒక జిల్లాలో మాత్రమే ఉండాలని వారు కోరారు. ఈ విషయంలో భారత ప్రధాన న్యాయమూర్తిని కూడా కలుస్తామని వారు చెప్పారు.
Advertisement