నాణ్యమైన విద్యుత్‌ సరఫరా కోసమే ఛార్జీలు పెంచాం: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ ఛార్జీల పెంపును ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్ధించుకున్నారు. తాము పెంచిన రేట్లు 86 శాతం మందికి వర్తించవని కేవలం 14 శాతం మంది మాత్రమే పెంపు పరిధిలోకి వస్తారని తెలిపారు. ఏపీలోనే విద్యుత్‌ ఛార్జీలు తక్కువగా ఉన్నాయని, అధిక రేటుకు విద్యుత్‌ కొనడం వల్లే ఛార్జీలు పెంచాల్సి వచ్చిందని వివరించారు. ఏపీ ఈఆర్‌సీ 22.5 శాతం పెంచమని సిఫార్సు చేసిందని, కాని దాన్ని తాను తిరస్కరించానని బడ్జెట్‌లో లోటు 3 వేల కోట్లకు పైనా ఉన్నా […]

Advertisement
Update:2015-03-24 07:22 IST

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ ఛార్జీల పెంపును ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్ధించుకున్నారు. తాము పెంచిన రేట్లు 86 శాతం మందికి వర్తించవని కేవలం 14 శాతం మంది మాత్రమే పెంపు పరిధిలోకి వస్తారని తెలిపారు. ఏపీలోనే విద్యుత్‌ ఛార్జీలు తక్కువగా ఉన్నాయని, అధిక రేటుకు విద్యుత్‌ కొనడం వల్లే ఛార్జీలు పెంచాల్సి వచ్చిందని వివరించారు. ఏపీ ఈఆర్‌సీ 22.5 శాతం పెంచమని సిఫార్సు చేసిందని, కాని దాన్ని తాను తిరస్కరించానని బడ్జెట్‌లో లోటు 3 వేల కోట్లకు పైనా ఉన్నా కాని ఛార్జీలు ఎక్కువగా పెంచలేదని వివరించారు. 50 యూనిట్లు లోపు వాడుకునే ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగానే ఇస్తున్నామని, వ్యవసాయాధారిత పరిశ్రమలకు ఈ పెంపు వర్తించదని, ప్రార్థనామందిరాలకు కూడా ఛార్జీలు పెరగవని తెలిపారు. ఇప్పటికీ వ్యవసాయానికి 9 గంటలు నాణ్యమైన విద్యుత్‌ను ఇస్తున్నామని, నిజానికి తాను చేపట్టిన సంస్కరణలు గత ప్రభుత్వాలు సజావుగా అమలు చేసి ఉంటే ఈరోజు అసలు ఛార్జీలు పెంచాల్సి వచ్చేది కాదని చంద్రబాబు కాంగ్రెస్‌ పాలనను దునుమాడారు.

Tags:    
Advertisement

Similar News