జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై హైకోర్టు ఆదేశం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలపై సోమవారం హైకోర్టులో వాడి వేడి వాదనలు జరిగాయి. సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై విచారణ జరిగిన సందర్భంలో ఇంకా వార్డుల విభజన పూర్తి కాలేదని ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఎన్నికలు చేపడతామని ప్రభుత్వం తరఫున న్యాయవాది పేర్కొనగా ఎన్నాళ్ళ సమయం కావాలని హైకోర్టు ప్రశ్నించింది. వార్డుల విభజన ప్రక్రియను వెంటనే పూర్తి చేసి ఎన్నికల షెడ్యూలును ప్రకటించాలని కోర్డు ఆదేశించింది. ఒకవేళ […]
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలపై సోమవారం హైకోర్టులో వాడి వేడి వాదనలు జరిగాయి. సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై విచారణ జరిగిన సందర్భంలో ఇంకా వార్డుల విభజన పూర్తి కాలేదని ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఎన్నికలు చేపడతామని ప్రభుత్వం తరఫున న్యాయవాది పేర్కొనగా ఎన్నాళ్ళ సమయం కావాలని హైకోర్టు ప్రశ్నించింది. వార్డుల విభజన ప్రక్రియను వెంటనే పూర్తి చేసి ఎన్నికల షెడ్యూలును ప్రకటించాలని కోర్డు ఆదేశించింది. ఒకవేళ దీనిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తామే ఎన్నికల తేదీలను ప్రకటిస్తామని హైకోర్డు ఘాటుగా వ్యాఖ్యానించింది. ఎన్నాళ్ళు ఎన్నికలను వాయిదా వేసుకుంటూ పోతారని ప్రశ్నించింది. ఇకనైనా ఈ ప్రక్రియ వేగంగా చేపట్టాలని కోర్టు ఆదేశించింది.