కాంట్రాక్టర్ల కొమ్ము కాస్తున్న చంద్రబాబు

ఒకవైపు రాష్ట్రం దివాళ తీస్తోందని చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కాంట్రాక్టర్లకు అప్పనంగా డబ్బులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని, దీని వెనుక మతలబు ఏమిటో ప్రజలు గ్రహించాలని అన్నారు. 2013 నుంచి కాంట్రాక్టర్లకు డబ్బులిచ్చేలా 22 నెంబర్‌ జీవో చంద్రబాబు తెచ్చారని. ఇదేం పద్ధతో అర్ధం కాదు. ప్రతీ ప్రాజెక్టులో 40 శాతం వరకు స్టీలు, సిమ్మెంట్‌, ఇంధన ఖర్చులుంటాయి. మిగతావి లేబర్‌ ఖర్చులు. ఈపీసీ కాంట్రాక్టు నిబంధనల ప్రకారం సిమ్మెంట్‌, స్టీలు, ఇంధన ఛార్జీలు 5 శాతం అంచనాలు […]

Advertisement
Update:2015-03-20 10:55 IST

ఒకవైపు రాష్ట్రం దివాళ తీస్తోందని చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కాంట్రాక్టర్లకు అప్పనంగా డబ్బులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని, దీని వెనుక మతలబు ఏమిటో ప్రజలు గ్రహించాలని అన్నారు. 2013 నుంచి కాంట్రాక్టర్లకు డబ్బులిచ్చేలా 22 నెంబర్‌ జీవో చంద్రబాబు తెచ్చారని. ఇదేం పద్ధతో అర్ధం కాదు. ప్రతీ ప్రాజెక్టులో 40 శాతం వరకు స్టీలు, సిమ్మెంట్‌, ఇంధన ఖర్చులుంటాయి. మిగతావి లేబర్‌ ఖర్చులు. ఈపీసీ కాంట్రాక్టు నిబంధనల ప్రకారం సిమ్మెంట్‌, స్టీలు, ఇంధన ఛార్జీలు 5 శాతం అంచనాలు పెరిగితేనే అదనపు నిధులు ఇవ్వాలని కాని దీనికి భిన్నంగా కాంట్రాక్టర్ల ప్రతినిధిగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని జగన్‌ ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పుడున్న విధంగా ఇసుక రేట్లు ఎక్కడా లేవని, ఎక్కడపడితే అక్కడ ఇసుక దందాలు జరుగుతున్నాయని, డీడీ పద్ధతి పెట్టి ఒక్క డీడీపై పదుల సంఖ్యలో లారీలు తరలిపోతున్నాయని దీన్ని ప్రభుత్వంలోని పెద్దలే అండగా ఉండి నడిపిస్తున్నారని జగన్‌ ఆరోపించారు. కేవలం సమయం లేదన్న సాకుతో తమకు నచ్చిన వారికి ఇసుక కాంట్రాక్టులు కట్టబెట్టారని ఆరోపించారు. ఎన్నికల ముందు చెట్టు కింద నుంచే పరిపాలన సాగిస్తానన్న ఈ పెద్దమనిషి అనంతరం సెక్రటరియేట్‌ మరమత్తులకు కోట్ల రూపాయలు ఖర్చు చేశాడని జగన్‌ విమర్శించారు. బడ్జెట్‌ లెక్కలన్నీ తప్పుల తడకలని, ఆదాయాలకు, ఖర్చులకు పొంతన లేదని జగన్‌ అన్నారు. బడ్జెట్లో లెక్కలను పెంచి చూపిస్తే… అది కేంద్రం గమనిస్తే ఢిల్లీలో మన పరువు ఏం కాను? బడ్జెట్‌లో చూపించిన ఖర్చులు 80 వేల కోట్లకు మించి లేవు. కాదూ…కూడదు అనుకుంటే… 90 వేల కోట్లు అనుకుందాం. కాని లక్షా 12 వేల కోట్లు ఎందుకు చూపించారు? ఇలా అకౌంట్లను పెంచి చూపించడం, మోసం చేయడం, వెన్నుపోట్లు పొడవడం చంద్రబాబుకు అలవాటేనని ఆయన అన్నారు. ఇలా చేయడం వల్ల ఢిల్లీలో మన పరువు ఏంకాను అంటూ ప్రశ్నించారు.

Tags:    
Advertisement

Similar News