తెలంగాణ ఉద్యమంలో సీఎం రేవంత్‌రెడ్డి ఎక్కడున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ అధినేత కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర దీక్షకు దిగగా ఆయనను ఖమ్మం జైలులో పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని హరీశ్‌రావు అన్నారు. జైలులో దీక్ష కొనసాగిస్తే సొనియా గాంధీ దిగొచ్చి డిసెంబర్ 9న ప్రకటన చేసిందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ దీక్ష, తెలంగాణ ప్రజల పోరాట ఫలితమే స్వరాష్ట్రం ఏర్పాటైందని ఆయన అన్నారు. ఆనాడు టీటీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రాజీనామా చేయకుండా పారిపోయారని మాజీమంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో చంద్రబాబును నిలదీస్తే, ఎవడ్రా మా నాయకుడిని నిలదీసేది అని ఉద్యమకారుల మీదకు తుపాకీ పట్టుకొని పోయిన రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి అని హరీశ్‌రావు అన్నారు
Previous Articleవరంగల్ ఎయిర్పోర్ట్ భూసేకరణ వేగంగా పూర్తి చేయాలి
Next Article తెలంగాణ ఉద్యమంలో రేవంత్‌ది ద్రోహ చరిత్రే
Keep Reading
Add A Comment