ఏపీ టెన్త్ క్లాస్ పరీక్షలు ఎప్పుడంటే?
ఏపీలో పదోతరగతి పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు.
BY Vamshi Kotas11 Dec 2024 7:22 PM IST
X
Vamshi Kotas Updated On: 11 Dec 2024 7:35 PM IST
ఏపీ టెన్త్ క్లాస్ పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. వచ్చే ఏడాది మార్చి 17 నుంచి 31 వరకు పదో తరగతి పరీక్షలు జరుగనున్నాయి. మార్చి 17న ఫస్ట్ లాంగ్వేజ్, 19న సెకండ్ లాంగ్వేజ్, 21న ఇంగ్లీషు, 24న మ్యాథ్య్స్, 26న ఫిజిక్స్, 28న బయోలజీ, 31న సోషల్ పరీక్షలు జరుగనున్నాయి. విద్యార్థులు చదివేందుకు వీలైనంత సమయం తీసుకొని మంచి మార్కులు సాధించాలని సూచించారు. విద్యార్థులు ఇప్పటి నుంచే ఒక టైమ్ టేబుల్ ఏర్పాటు చేసుకొని పరీక్షలకు సన్నద్ధం కావాలని.. పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలని సూచించారు. పదో తరగతి మార్కులు చాలా కీలకమని మంత్రి లోకేష్ తెలిపారు. ఉదయం 09:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరుగుతాయి.ఏపీలో పదోతరగతి పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు.
Next Story