తెలంగాణ తల్లి రూపురేఖల్ని మార్చడం ఖండిస్తున్నాము : ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ తల్లి రూపురేఖల్ని మార్చడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు.
తెలంగాణ తల్లి రూపురేఖల్ని మార్చి సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించడం దురదృష్టకరమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్చర్యకు తెలంగాణ తల్లి కన్నీళ్ళు పెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ తల్లిని నేడు కాంగ్రెస్ తల్లిగా మార్చారని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని రహదారిలో ఏర్పాటు చేసి తెలంగాణ తల్లి అని చెబుతున్న విగ్రహాన్ని చెరసాలలో ఏర్పాటు చేస్తున్నారని ఇది అన్యాయన్ని తెలిపారు. యావత్తు ప్రజలు కాంగ్రెస్ తల్లిని తిరస్కరిస్తున్నామని స్పష్టం చేశారు.
కోట్లాది మంది తెలంగాణ బిడ్డల్లో స్ఫూర్తి నింపింది తెలంగాణ తల్లి రూపురేఖల్ని మార్చడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని కవిత అన్నారు. తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను దూరం చేశారు బతుకమ్మను మాయం చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. తెలంగాణ తల్లికి నివాళులు అర్పించాలి అనుకుంటే గన్ పార్క్ దగ్గర ముక్కు నెలకు రాయాలి సీఎం రేవంత్‌రెడ్డిని డిమాండ్ చేశారు. ఉద్యమ కారుల పై తుపాకీ ఎక్కు పెట్టినందుకు తెలంగాణ తల్లికి నివాళులర్పించే హక్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.