అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు : ఎమ్మెల్సీ కవిత
సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రతిపక్షాలకు సమాధానం చెప్పలేక కేటీఆర్‌పై అక్రమంగా, కక్షపూరిత కేసులు పెడుతున్నారని కవిత అన్నారు
అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రతిపక్షాలకు సమాధానం చెప్పలేక కేటీఆర్‌పై అక్రమంగా, కక్షపూరిత కేసులు పెడుతున్నారని కవిత అన్నారు. మేమంతా తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన కేసీఆర్ సైనికులమనే విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోవాలి అక్రమంగా కేసులు పెడుతూ మీరు చేస్తున్న ప్రయత్నాలు మమ్మల్ని భయపెట్టలేవు. మేం మరింత బలపడతాం. మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. తెలంగాణ స్ఫూర్తి గెలుస్తుంది’’ అని కవిత అన్నారు. అధినేత కేసీఆర్‌ను బీఆర్‌ఎస్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ట్వీట్టర్ వేదికగా మండిపడ్డారు. చిల్లర వ్యూహాలతో మమ్మల్ని భయపెట్టాలనుకోవడం అవివేకం అని ఆమె తెలిపారు. తెలంగాణ ఉద్యమ పోరాటం నుంచి పుట్టామని అన్నారు. మీ చిల్లర వ్యూహాలు మమ్మల్ని భయపెట్టవు.. అవి మా సంకల్పానికి మరింత బలం చేకూరుస్తాయని అన్నారు. పోరాటం మాకు కొత్త కాదు.. అక్రమ కేసులతో మా గొంతులను నొక్కలేరని వెల్లడించారు. ఈ క్రమంలోనే అన్న కేటీఆర్‌తో దిగిన ఫోటోను ఎమ్మెల్సీ కవిత షేర్ చేశారు.