Telugu Global
Telangana

పోలీసులు నన్నే అడ్డుకున్నారు అందుకే బైఠాయించాను : సీఎం రేవంత్ రెడ్డి

దేశంలో వ్యాపార వ్యవస్థలు అవినీతిలో కూరుకుపోయాయని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు.

పోలీసులు నన్నే అడ్డుకున్నారు అందుకే  బైఠాయించాను : సీఎం రేవంత్ రెడ్డి
X

గౌతమ్ అదానీని కాపాడేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మణిపుర్‌ అల్లర్లు, అదానీపై వచ్చిన ఆర్థిక అవకతవకల ఆరోపణల అంశంలో ఎన్డీయే సర్కార్‌కు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ‘చలో రాజ్‌భవన్‌’ చేపట్టారు. ఈ సందర్భంగా రాజ్‌భవన్‌ సమీపంలో ముఖ్యమంత్రి రోడ్డుపై బైఠాయించిన నిరసన తెలిపారు. ఇండియాలో బిజినేస్ వ్యవస్థలు అవినీతిలో కూరుకుపోయాయని సీఎం అన్నారు. అదానీ, ప్రధాని కలిసి భారత దేశ పరువు తీశారని ఆరోపించారు. ప్రపంచ దేశాల ముందు భారత్‌ పరువును తాకట్టుపెట్టారని ఆక్షేపించారు..

అలాగే పార్లమెంట్‌లో అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని.. అలా చేస్తూ అదానీ కచ్చితంగా జైలుకు వెళ్తారని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అలాగే అదానీ వ్యవహారంపై తెలంగాణ అసెంబ్లీలో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని.. సభలో అదానీ అంశంపై తీర్మానం చేసి పార్లమెంటుకు పంపుదామని.. ఈ సందర్భంగా సీఎం చెప్పుకొచ్చారు.. రాజ్ భవన్ ముట్టడికి వెళ్తున్న మతను హైదరాబాద్ పోలీసులు కూతవేటు దూరంలో అడ్డుకున్నారని.. ఈ క్రమంలోనే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నామని సీఎం చెప్పుకొచ్చారు. ప్రభుత్వంలో ఉండి తాము చేస్తున్న ఈ నిరసన కొంత మందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చని అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ప్రజల వైపా అదానీ ప్రధానీ వైపా అని తేల్చుకోవాలని రేవంత్‌రెడ్డి అన్నారు.

First Published:  18 Dec 2024 3:01 PM IST
Next Story