Telugu Global
Telangana

భుమికి విత్తనానికి ఉండే అనుబంధం..రైతుకు కాంగ్రెస్ పార్టీకి బంధం ఒక్కటే : సీఎం రేవంత్‌

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నాలుగు సంక్షేమ పథకాలను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.

భుమికి విత్తనానికి ఉండే అనుబంధం..రైతుకు కాంగ్రెస్ పార్టీకి బంధం ఒక్కటే : సీఎం రేవంత్‌
X

భుమికి విత్తనానికి ఉండే బలమైన అనుబంధం రైతుకు కాంగ్రెస్ పార్టీకి ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా కోడంగల్ నియోజకవర్గ పరిధిలోని కోస్గీ మండలం చంద్రవంచ గ్రామంలో 4 సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి రైతు పక్షపాతిగా ఉందని ఆయన అన్నారు. రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వ్యవసాయాన్ని పండుగలా మారుస్తున్నామని పేర్కొన్నారు.రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ దే అని తెలిపారు.

వ్యవసాయానికి ఉచిత విద్యుత్ మొదలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేసారు. భూమి లేని పేద రైతులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రూ.12వేలు సంవ్సరానికి అందిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేశామని తెలిపారు. దేశంలో ఏరాష్ట్రంలో ఇవ్వని విధంగా.. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నామని తెలిపారు. పేదవారికి ఇందిరమ్మ ఇల్లు అనగానే వైఎస్సార్ గుర్తుకొస్తారు. వైఎస్ హయాంలో ఇందిరమ్మ ఇండ్లు అధికంగా ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ రైతుల కళ్లలో ఆనందం కోసమే రైతు భరోసా ఇస్తున్నామని సీఎం తెలిపారు

First Published:  26 Jan 2025 3:44 PM IST
Next Story