అదో లొట్టపీస్ కేసు..వాడొక లొట్టపీస్ ముఖ్యమంత్రి.. కేటీఆర్ హాట్ కామెంట్స్
సీఎం రేంవంత్ రెడ్డి పెట్టిన లొట్టపీపీసు కేసకు భయపడేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పెట్టిన లొట్టపీపీసు కేసకు భయపడేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వాడొక లొట్టపీస్ ముఖ్యమంత్రి అని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ డైరీ ఆవిష్కరణ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. 2001లో కేసీఆర్ పార్టీ పెట్టిన రోజున ఉండే ఇబ్బందులతో పోల్చితే.. ఇది ఇబ్బందే కాదన్నారు. ఫార్ములా ఈ-రేసు కేసు ఓ లొట్టపీసు కేసని.. ఆ కేసుతో ఏం కాదని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్నామని.. వాటి ముందు ఇవి చాలా చిన్నవేనని తెలిపారు. చావు నోట్లో తలపెట్టి అధినేత కేసీఆర్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు. కేసీఆర్ నాయకత్వంలో ఎదిగిన తమకు ఇలాంటివి పెద్ద సమస్య కాదని కొట్టిపడేశారు. మాజీ సీఎం కేసీఆర్ ఆనాడు కడుపు మాడ్చుకొని తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సపచ్చుడో.. తెలంగాణ జైత్రయాత్రనో.. కేసీఆర్ శవయాత్రనో అని కూర్చున్న ఇబ్బంది ముందు ఇది ఏం ఇబ్బంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఓయూలో బాల్క సుమన్, ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో పాటు పలువురి విద్యార్థి నేతల వీపులు విమానం మోత మోగినాయి. యాదయ్య, శ్రీకాంతాచారి ఒంటి మీద పెట్రోల్ పోసుకుని భగభగమండుతుంటే ఆ ఇబ్బంది ముందు ఇది ఏం ఇబ్బంది.. ఇది లొట్టపీస్ కేసు.. వాడు పీకేది ఏం లేదు అని కేటీఆర్ తేల్చిచెప్పారు.
కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు మజిల్ పవర్, మీడియా పవర్ లేదు.. అగమ్యగోచర పరిస్థితుల్లో తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసి చావునోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్. అలాంటి కేసీఆర్ తయారు చేసిన సైనికుడిగా , కేసీఆర్ రక్తం పంచుకుపుట్టిన బిడ్డగా ఇది ఇబ్బంది కానేకాదు. ఎవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అని కేటీఆర్ స్పష్టం చేశారు.కేసీఆర్ నాయకత్వంలో ఎదిగిన తమకు ఇలాంటివి పెద్ద సమస్య కాదని కొట్టిపడేశారు.తెలంగాణలో తీడీ పాలన నడుస్తోందని అన్నారు. త్రీడీ అంటే డిసెప్షన్.. డిస్ట్రాక్షన్.. డిస్ట్రక్షన్ అని ఎద్దేవా చేశారు. కేసులు తమకు సమస్యే కాదని..కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడమే తమ పని అని అన్నారు. కేసు విషయాన్ని తాను చూసుకుంటానని.. కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నికల సందర్భంగా రూ.15 వేలు పంట పెట్టుబడి ఇస్తామని చెప్పిన రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు రూ.12వేలు మాత్రమే ఇస్తానంటోందని అన్నారు. దేవుళ్ల మీద ఒట్టు పెట్టి రుణమాఫీపై మాట తప్పారని కేటీఆర్ అన్నారు. త్వరలోనే బూత్ నుంచి రాష్ట్ర స్థాయి కమీటీలు వేసుకుందామని.. జిల్లా నాయకులు రాష్ట్రానికి రావడం కాదని. తామే జిల్లాలకు వెళ్తామని అన్నారు. తెలంగాణ ప్రయోజనాలే పరమావధిగా పనిచేసే పార్టీ బీఆర్ఎస్ అని.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే తమకు బాగుందని మాట్లాడటం మన ఖర్మ అని మాజీ మంత్రి అన్నారు.