Telugu Global
Telangana

తెలంగాణ ఎస్‌డీఆర్‌ఎఫ్‌‌ను ప్రారంభించిన సీఎం రేవంత్

తెలంగాణలో జాతీయ విపత్తు స్పందన దళం తరహాలో రాష్ట్ర విపత్తు స్పందన దళం రంగంఅందుబాటులోకి రానుంది.

తెలంగాణ ఎస్‌డీఆర్‌ఎఫ్‌‌ను  ప్రారంభించిన సీఎం రేవంత్
X

కాంగ్రెస్ విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ విపత్తు నిర్వహణ దళంను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో 2వేల మంది సిబ్బందితో ఏర్పాటైన ఎస్‌డీఆర్‌ఎఫ్‌ భారీ అగ్ని ప్రమాదాలు, వరదలు, భూకంపం వంటి విపత్తులు సంభవించినప్పుడు అత్యవసర సహాయ చర్యలు చేపట్టడానికి ఈ దళం అన్ని వేళలా సిద్ధంగా ఉంటుంది. ఫైర్ స్టేషన్లు ఇక నుంచి ఎస్‌డీఆర్‌ఎఫ్ స్టేషన్లుగా మార్పు చెందనున్నాయి.జులై, ఆగస్టు నెలల్లో సంభవించిన వరదలకు పలు ప్రాంతాలు నీటమునిగిన క్రమంలో ముఖ్యమంత్రి అత్యవసర సమీక్ష నిర్వహించారు.

ఎన్‌డీఆర్ఎఫ్‌ తరహాలో సుశిక్షుతులైన దళం అవసరమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఎస్‌డీఆర్‌ఎఫ్‌ను తీర్చిదిద్దడంతో పాటు ఆధునికీకరించేందుకు ప్రభుత్వం రూ.35.03 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో అధునాతన పరికరాలు, నూతన అగ్నిమాపక వాహనాలు కొనుగోలు చేసి సిబ్బందికి ఎస్‌డీఆర్‌ఎఫ్ ప్రాథమిక కోర్సుల్లో శిక్షణ ఇప్పించారు.అగ్నిమాపక శాఖకు చెందిన వెయ్యి మందికి తమిళనాడులోని అరక్కోణం, మహారాష్ట్రలోని పుణే, గుజరాత్‌లోని వడోదరా, ఏపీలోని కృష్ణాజిల్లాలో ఉన్న ఎన్డీఆర్ఎఫ్ కేంద్రాల్లో శిక్షణ ఇప్పించారు. తెలంగాణ వ్యాప్తంగా 37 ఫైర్​స్టేషన్లలోని దాదాపు వెయ్యి మంది సిబ్బందితో పాటు తెలంగాణ ప్రత్యేక పోలీసు విభాగానికి చెందిన పది కంపెనీలతో కూడిన 1000 మంది సిబ్బంది ఈ దళంలో విధులు నిర్వర్తించనున్నారు.

First Published:  6 Dec 2024 5:52 PM IST
Next Story