చదువుపై పెట్టే ఖర్చు భవిష్యత్‌పై పెట్టుబడి : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలోని గురుకులాల్లో మార్పు తీసుకొస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.
చదువుపై పెట్టే ఖర్చు భవిష్యత్‌పై పెట్టుబడి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా చిల్కూరులోని గురుకులను ఆయన సందర్మించారు. ఈ సందర్బంగా విద్యార్థులతో ముఖ్యమంత్రి ముచ్చటించారు. గురుకులాల్లో విద్యార్థులకు సరికొత్త డైట్ ప్లాన్ ఇస్తున్నామని క్వాలీటీ ఫుడ్ విషయంలో రాజీ పడమని సీఎం అన్నారు. హాస్టల్స్, గురుకులాల్లో కామన్ డైట్ ప్లాన్ ప్రారంభమైంది. మెస్ మెనూలో బ్రేక్ ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ ఉంటుంది. వారం రోజుల్లో ఐదు రోజులు కోడిగుడ్డు పెట్టాలని నిర్ణయించామన్నారు. తెలంగాణలో 26వేల ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. గురుకులాల్లో మార్పు తీసుకొస్తున్నాం. రెసిడెన్షియల్ స్కూల్స్‌లో విద్యా ప్రమాణాలను పెంచుతాం. ప్రైవేటు పాఠశాలల్లో చదివితేనే రాణిస్తారనే అపోహ ఉండేది.అలాంటి అపోహలను తొలగించాలని ప్రజా ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో పీవీ నరసింహారావు మొట్టమొదటిసారిగా రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభించారని తెలిపారు. వంట వండే కానుంచి సూపర్ వైజర్ చూసుకుంటారని రేవంత్ తెలిపారు. 26వేల ప్రభుత్వ పాఠశాలల్లో 11 లక్షల మంది చదువుతుంటే.. తక్కువున్న ప్రైవేటు స్కూల్స్ 33 లక్షల మంది ఎందుకు చదువుతున్నారు?. మల్టీ టాలెంటెడ్ స్టూడెంట్స్ ప్రభుత్వ స్కూల్స్ నుంచి ఎందుకు రావడం లేదు?. ఇలా ఎందుకు జరుగుతుందో ప్రభుత్వ టీచర్లు ఆలోచించాలి. విద్యాపై పెట్టే పెట్టుబడి భవిష్యత్‌పై పెట్టేదే.గురుకులాలు, హాస్టల్స్‌లో విద్యార్థులు చనిపోతే బాధ్యత ఎవరిది?. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. గురుకులాల బాట కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. ప్రతీనెలా పదో తేదీలోపు డైట్ ఛార్జీలు చెల్లిస్తామని రేవంత్ తెలిపారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్‌లో చదువుకున్న వారు ఎంతో మంది ఐఏఎస్, ఐపీఎస్ లుగా ఎంపికయ్యారని.. బుర్రా వెంకటేశం ఐఏఎస్, మహేందర్ రెడ్డి ఐపీఎస్.. రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులే అని చెప్పారు. రెసిడెన్షియల్ స్కూల్‌లో చదువుకున్న వాళ్లు ఎంతో మంది గొప్పగా రాణించారని తెలిపారు.