తనలాగే అందరూ జైలుకెళ్లాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు :కేటీఆర్
సీఎం రేవంత్ రెడ్డి తీరుపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వైఖరిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసులో డబ్బు సంచులతో రెడ్ హ్యాండెడ్‌గా దొరికి జైలుకు వెళ్లొచ్చిన రేవంత్ రెడ్డి. తనలాగే అందరూ జైలు జీవితాన్ని అనుభవించాలని భావిస్తున్నట్లు ఉన్నారని విమర్శించారు. ఈ మేరకు ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ (ఎక్స్) ద్వారా షేర్ చేస్తూ మండిపడ్డారు. ఓ ప్రభుత్వ స్కీమ్ ద్వారా తమ సంస్థపై ప్రభావం పడే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు జైలుకు పంపిస్తానని ప్రతిష్టాత్మక సంస్థ అయిన L&T కంపెనీకి చెందిన CXOను బహిరంగంగా, నిర్మొహమాటంగా బెదిరిస్తున్నారని కేటీఆర్ ఫైర్‌య్యారు.
ఇలాంటి పనికిమాలిన ప్రకటనలతో పారిశ్రామిక వర్గాలకు ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు. పెట్టుబడులను ఆకర్షించడానికి ఇదేనా మీరు అనుసరిస్తున్న వ్యూహమని లోక్‌సభలో ప్రతిపక్ష నేత నేత రాహుల్‌గాంధీని నిలదీశారు. ఫార్ములా-ఈ కార్ రేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి కేటీఆర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ నుంచి ఆమోదం లభించిందని, సంబంధిత ఫైల్ రాష్ట్ర ప్రభుత్వానికి చేరినట్లు టాక్