కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు : విమలక్క
కాంగ్రెస్ ఏడాది పాలన విజయోత్సవాలు జరుపుకోవడానికి ఏం విజయాలు చేశారని జరుపుకుంటున్నారని ప్రజా గాయకురాలు విమలక్క అన్నారు.
కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని ప్రజా గాయకురాలు విమలక్క అన్నారు. రేవంత్ ప్రభుత్వంలో ప్రజలకు కావాల్సిన ప్రయోజనాలు ఇప్పటి వరకు జరగలేదని ఆమె అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహంపై చర్చ అవసరమా అని విమలక్క ప్రశ్నించారు. తెలంగాణ తల్లిపై చర్చ జరగడం బాధగా ఉందన్నారు. నిత్యం ప్రజల సమస్యలపై పోరాడుతూనే ఉన్నామన్నారు. ప్రభుత్వాలు ప్రజల కోసం ఆలోచించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఒకవైపు మూసీ ప్రక్షాళన అంటూనే మరో వైపు కాలుష్యనికి తెర లేపుతున్నారని ఆమె తెలిపారు.
రైతు బంధు ఇవ్వకపోవడం, మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కట్టకపోవడంతో ఎక్కడికక్కడ ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వ పట్లా తీవ్ర నిరసన వ్యక్తం అవుతుందని విమలక్క అన్నారు. ఎన్ కౌంటర్లు లేని తెలంగాణ కావాలని పోరాడితే వరుసగా ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ప్రభుత్వం సమీక్షించుకోవాలని విమలక్క వ్యాఖ్యలు చేశారు.ప్రభుత్వంపై నిరసన మొదలైందన్నారు. ఎక్కడ విజయం సాధించారని విజయోత్సవాలు చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం తన పనితీరుపై సమీక్షించుకోవాలని హితవుపలికారు. ఏం హామీలు ఇచ్చాం.. ఏం చేస్తున్నామని ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలన్నారు.