Telugu Global
Telangana

ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్‌పై స్పందించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

అధిష్టానాన్ని కలిసి అన్ని విషయాలు చర్చిస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు.

ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్‌పై స్పందించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
X

రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య భేటీపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తాజాగా స్పందించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నాయకత్వం వహించారని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేల సమావేశం అయ్యింది వాస్తవం కానీ అందులో రహస్యం ఏమీ లేదు’ అని క్లారిటీ ఇచ్చారు. రహస్యంగా భేటీ కావాల్సిన అవసరమూ తమకు లేదని స్పష్టం చేశారు. ఈమేరకు ఇవాళ ఓ మీడియా సంస్థతో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తన వ్యక్తిత్వాన్ని తప్పుగా చూపిస్తే ఊరుకోబోనని ఫైర్‌య్యారు. నేను ఏ ఫైల్ క్లియర్ చేయమని అడగలేదు. ఏ ఫైల్ క్లియర్ చేయమని అడిగానో రెవెన్యూ మంత్రి పొంగులేటి, ఎంపీ మల్లు రవి చెప్పాలి.

ఎవరి చరిత్ర ఏంటో అందరికీ తెలుసు. రేపు దీపాదాస్ మున్షిని కలిసిన అన్ని వివరాలు వెల్లడిస్తా.అధిష్టానాన్ని కలిసి అన్ని విషయాలు చర్చిస్తా’ అని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పష్టంచేశారు. కాగా, మహాబూబ్ నగర్ జిల్లా మంత్రికి ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి అసలు పడటం లేదని తెలుస్తోంది. వారిద్దరి మధ్య​ అంతరం పెరగడం వల్లే రహస్యంగా ఎమ్మెల్యేలు భేటీ కావాల్సి వచ్చినట్లు కాంగ్రెస్ అధిష్టానానికి నివేదిక వెళ్లినట్లు టాక్.

First Published:  2 Feb 2025 1:37 PM IST
Next Story