మాజీ ఎంపీ మందా జగన్నాథంను పరామర్శించిన హరీశ్‌రావు
అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగర్‌కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథంను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పరామర్శించారు.
అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగర్‌కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథంను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు హరీశ్‌రావు ధైర్యం చెప్పారు . అనంతరం జగన్నాథం హెల్త్ కండిషన్ వివరాలను డాక్టర్‌లను అడిగి హరీశ్‌రావు తెలుసుకున్నారు. మందా జగన్నాథంను పరామర్శించిన వారిలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, మాజీ మంత్రులు దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి కూడా ఉన్నారు.
మరెండు రోజుల క్రితం గుండెపోటుకు గురైన జగన్నాథంను ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించిన సంగతి తెలిసిందే. 1996లో ఆయన తొలిసారిగా తెలుగు దేశం పార్టీ తరఫున నాగర్‌కర్నూల్ ఎంపీగా విజయం సాధించారు. 1999, 2004లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై మళ్లీ గెలుపోందారు. ఆతర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన 2009 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. 2014లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు.