Telugu Global
Telangana

రేవంతన్నకి అభినందనలు..వైఎస్ షర్మిల ట్వీట్

తెలంగాణలో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికి వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు.

రేవంతన్నకి అభినందనలు..వైఎస్ షర్మిల ట్వీట్
X

తెలంగాణలో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రులకు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. ఏడాది పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ అన్నకి, సహచర మంత్రులకు, ఎమెల్యేలకు, ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు హృదయ పూర్వక అభినందనలు అని షర్మిల ఎక్స్‌లో తెలిపారు. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలందరినీ భాగస్వాములను చేస్తూ, సంక్షేమ, అభివృద్ధి రాజ్యంగా, తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే ధ్యేయంగా ముందుకు సాగడం అభినందనీయమని కొనియాడారు.

అంతేగాక కాంగ్రెస్ తోనే రాష్ట్రాల అభివృద్ధి జరుగుతుందని, హస్తమే దేశానికి అభయహస్తంగా నిలుస్తుందని షర్మిల స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతూ.. తెలంగాణ మంత్రివర్గంలోని సభ్యులను ట్యాగ్ చేశారు. ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు హృదయపూర్వక అభినందనలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలందరినీ భాగస్వాములను చేస్తూ, సంక్షేమ, అభివృద్ధి రాజ్యంగా, తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే ధ్యేయంగా ముందుకు సాగడం అభినందనీయమని షర్మిల పేర్కొన్నారు.

First Published:  7 Dec 2024 5:48 PM IST
Next Story