తెలంగాణలో గొప్ప యోధులు జన్మించారు : దేవేందర్ గౌడ్
తెలంగాణ ఉద్యమంపై లోతైన చర్చ జరగాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు

తెలంగాణ ఉద్యమంపై లోతైన చర్చ జరగాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తాజాగా హైదరాబాద్ జలవిహార్‌లో జరిగిన మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ రచించిన ‘విజయ తెలంగాణ’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు.తెలంగాణ ఉద్యమ చరిత్రపై సమగ్రమైన పుస్తకాలు రావాలని ఆకాంక్షించారు. ప్రజలు కోరుకున్న విధంగానే ఇప్పుడు టీఎస్‌ను టీజీగా మార్చామన్నారు. వ్యక్తిగతంగా గౌరవించే నాయకుల్లో దేవేందర్ గౌడ్ ముందుంటారు. పుస్తకావిష్కరణ కార్యక్రమానికి తాను ముఖ్యఅతిథిగా రావడం రాజకీయ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే విషయం అన్నారు.
వివిధ సందర్భాల్లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థిని, విద్యార్థుల గురించి తెలియాలి అన్నారు. ఈ సందర్బంగా దేవేందర్ గౌడ్ మాట్లాడుతు తెలంగాణ చరిత్ర, సంస్కృతి ఉన్న ప్రాంతమని ఆయన అన్నారు. శాతావాహనులు, విఘ్ణ కుండినులు తెలంగాణ కేంద్రంగా దక్షిణ భారత దేశాన్ని పాలించారన్నారు. అదే విధంగా పోతన, సోమనాథుడు, సుద్దాల హన్మంతు, కాళోజీ వంటి గొప్ప కవులు, కొమరం భీమ్, సర్వాయి పాపన్న, చాకలి ఐలమ్మ, వంటి గొప్పయోధులు తెలంగాణలో జన్మించారని దేవేందర్ గౌడ్ అన్నారు