నాంపల్లి స్పెషల్ కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
పీసీసీ అధ్యక్షుడి హోదాలో రిజర్వేషన్లపై మాట్లాడిన కేసులో నాంపల్లి కోర్టుకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు.
BY Vamshi Kotas20 Feb 2025 5:10 PM IST

X
Vamshi Kotas Updated On: 20 Feb 2025 5:10 PM IST
నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డిపై నల్గొండ టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో, బేగంబజార్ పీఎస్‌లో, మెదక్ జిల్లా కౌడిపల్లి పీఎస్ పరిధిలో మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల విచారణ నిమిత్తం ఆయన కోర్టుకు హాజరయ్యారు. రేవంత్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేసిందని టీపీసీసీ లీగల్‌సెల్ వైస్ ఛైర్మన్ తిరుపతి వర్మ తెలిపారు. తదుపరి విచారణను ప్రజాప్రతినిధుల కోర్టు మార్చి 23కి వాయిదా వేసింది.
Next Story