Telugu Global
Telangana

అన్నపూర్ణ తెలంగాణను ఆత్మహత్యల తెలంగాణగా చేశారు : కేటీఆర్

ఇది ప్రజాపాలన కాదు.. ప్రజలను వేధించే పాలన అని మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.

అన్నపూర్ణ తెలంగాణను ఆత్మహత్యల తెలంగాణగా చేశారు : కేటీఆర్
X

కాంగ్రెస్ సర్కార్ ఏడాది పాలనలో అన్నిరంగాల్లో ప్రభుత్వం విఫలమయ్యిందని ఇది ప్రజాపాలన కాదు.. ప్రజలను వేధించే పాలన అని మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో జరిగిన ఆకలిచావులు, ఆత్మహత్యలపై ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను పదేండ్ల పాలనతో మాజీ సీఎం కేసీఆర్ దేశానికే అన్నపూర్ణగా నిలబెట్టారని చెప్పారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో అన్నపూర్ణ తెలంగాణను సూసైడ్‌ల తెలంగాణను చేశారని మండిపడ్డారు. హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో తెలంగాణ రియల్ ఎస్టేట్‌ను కుదేలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పెట్టిన పెట్టుబడులు రాక, వడ్డీ కూడా ఎల్లక ఉసురు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పదేండ్ల పాలనలో వ్యవసాయ రంగానికి చేయూతనిచ్చి కేసీఆర్‌.. రైతులలో ఆత్మవిశ్వాసం నింపి, వ్యవసాయ రంగానికి వెన్నెముకగా నిలిచారని తెలిపారు. ఏడాది రేవంత్ పాలనలో సాగునీళ్లు లేక, కరంటు రాక, పంటలు కొనుగోలు చేయక, రైతుభరోసా లేక, రుణమాఫీగాక అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. ఇది ప్రజాపాలన కాదని, ప్రజలను వేధించే పాలన అంటూ ఎక్స్‌ వేదికగా విమర్శించారు. ఇది ప్రజాపాలన కాదు, ప్రజలను వేధించే పాలన అంటూ.. జాగో తెలంగాణ జాగో అని ట్వీట్ చేశారు. నేడు ఆత్మహత్యలకు సంబంధించి ఓ దిన పత్రికలో వచ్చిన కథనాలకు ట్విట్టర్ లో కేటీఆర్ పోస్ట్ చేశారు

First Published:  2 Feb 2025 11:06 AM IST
Next Story