Telugu Global
Telangana

అల్లు అర్జున్ కాలు పోయిందా? కన్ను పోయిందా? : సీఎం రేవంత్‌రెడ్డి

అల్లు అర్జున్‌ను పరామర్శించిన సీనీ ప్రముఖుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.

అల్లు అర్జున్ కాలు పోయిందా? కన్ను పోయిందా? : సీఎం రేవంత్‌రెడ్డి
X

అల్లు అర్జున్‌ను పరామర్శించిన సీనీ ప్రముఖుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఓ బాలుడు నెల రోజులుగా ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతుంటే వీళ్లెవరైనా పరామర్శించారా ? ఒక పూట జైలు వెళ్లిన హీరోను మాత్రం కాళ్లు చేతులు పోయిన మనిషిని చూడటానికి వెళ్లినట్లు వెళ్లారు. అక్కడేమైనా కాలు పోయిందా? కన్ను పోయిందా? చేయి పోయిందా కానీ ఆస్పత్రిలో ఓ ప్రాణం పోయింది. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఈ ఘటన పై అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడారు. పుష్ప-2 సినిమాకు రేవతి కుటుంబ సభ్యులు రూ.3వేలు ఒక టికెట్ పెట్టి.. రూ.12వేలు పెట్టి సినిమాకి వెళ్లారు. థియేటర్ రావద్దని హీరోకి పోలీసులు ముందే చెప్పారు. హీరోను చూసేందుకు వేలాది సంఖ్యలో అభిమానులు వచ్చారు. అల్లు అర్జున్ ర్యాలీగా రావడం వల్లనే ప్రమాదం జరిగిందన్నారు. థియేటర్ వద్ద నుంచి వెళ్లి పోవాలని పోలీసులు అల్లు అర్జున్ కి చెప్పారు.

అయినా బన్నీ సినిమా ముగిసిన తరువాత వెళ్లిపోతానని చెప్పాడు. రేవతి చనిపోయిన 11 రోజుల వరకు కూడా ఎవ్వరూ స్పందించలేదు. సినీ ప్రముఖులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ఏం ఆశిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. సంధ్య థియేటర్ లోంచి వెళ్లిపోయే ముందు కూడా అల్లు అర్జున్ ర్యాలీగా వెళ్లారు. వేల సంఖ్యలో అభిమానులు రావడంతో పరిస్థితి కంట్రోల్ కాలేదు. అందుకే తొక్కిసలాట జరిగిందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. సంధ్య థియేటర్ లో తొక్కిసలాటలో దిల్ సుఖ్ నగర్ కి చెందిన రేవతి అనే మహిళా మరణించిన విషయం తెలిసిందే.

First Published:  21 Dec 2024 3:28 PM IST
Next Story